జగమునకు మొగుడు జగదేక వీరుడు
యుగమునకు మొగుడు యుగపురుషుడు
కౌరవుల మొగుడు ఆ భీమ సేనుడు
రాముడు మొగుడు పో రావణునకు
ధన లక్ష్మికి మొగుడు ధైర్యవంతుడొకడె
వీర స్వర్గ మొగుడు వీర మృతుడు
మావయ్య పాలిటి మొగుడైన అల్లుని
ఇల్లాలు గావించె నిల్లరికము
రాజ్య సంపదల మొగుళ్ళు రాజ్యధనులు
సుజన హృదయాల మొగుళ్ళు సుకవి వరులు
ఎదుటి వాని తప్పుల నెంచి వదరు వాడు
అతడి పెళ్ళాని కైననూ మొగుడు కాడు
యుగమునకు మొగుడు యుగపురుషుడు
కౌరవుల మొగుడు ఆ భీమ సేనుడు
రాముడు మొగుడు పో రావణునకు
ధన లక్ష్మికి మొగుడు ధైర్యవంతుడొకడె
వీర స్వర్గ మొగుడు వీర మృతుడు
మావయ్య పాలిటి మొగుడైన అల్లుని
ఇల్లాలు గావించె నిల్లరికము
రాజ్య సంపదల మొగుళ్ళు రాజ్యధనులు
సుజన హృదయాల మొగుళ్ళు సుకవి వరులు
ఎదుటి వాని తప్పుల నెంచి వదరు వాడు
అతడి పెళ్ళాని కైననూ మొగుడు కాడు