Your Ad Here

"తాళి"oపు

జగమునకు మొగుడు జగదేక వీరుడు
యుగమునకు మొగుడు యుగపురుషుడు
కౌరవుల మొగుడు ఆ భీమ సేనుడు
రాముడు మొగుడు పో రావణునకు
ధన లక్ష్మికి మొగుడు ధైర్యవంతుడొకడె
వీర స్వర్గ మొగుడు వీర మృతుడు
మావయ్య పాలిటి మొగుడైన అల్లుని
ఇల్లాలు గావించె నిల్లరికము
రాజ్య సంపదల మొగుళ్ళు రాజ్యధనులు
సుజన హృదయాల మొగుళ్ళు సుకవి వరులు
ఎదుటి వాని తప్పుల నెంచి వదరు వాడు
అతడి పెళ్ళాని కైననూ మొగుడు కాడు
4 Responses
  1. చాల బాగుందండి...!


  2. బాగుంది మీ మొగుళ క్లాసిఫికేషను


  3. బాగుంది. యతులు కుదరడంతో పద్యం చదివినట్టుంది. సుజనహృదయాల మొగుడనిపించుకున్నారు. పద్యం బాలేదని ఎవరూ అనడానికి వీల్లేకుండా చివర్లో భలే మెలికపెట్టేశారే! :)


  4. @చైతన్య గారు @కొత్తపాళీ గారు
    కృతఙ్ఞతలు
    @రానారె గారు
    చిన్నప్పుడు మా మావయ్య గారు సరదాగా"నీ పెళ్లానికి మొగడా"అని తిట్టే(?)వారు.
    ఆ థాట్ ని పెంచిపోషిస్తే ఇలా కవిత అయ్యింది.
    మీ కామెంట్ కి నెనర్లు
    --సంతోష్ సూరంపూడి