Your Ad Here
గుండెల్లో గురి నీకు గురువయ్యే గమనం ఒంట్లో బలమంతా వేగమయ్యే నిమిషం
సెకన్లకై తపించిన సంవత్సరాల సాక్షిగా గాయాల బాధలే మురళీ స్వరాలుగా
అడుగెయ్ జగాన్ని వెంట నడిపించే లాగా
పడదొయ్ ఓటమిని నీ వెనకపడే లోగా గుండెల్లో
కొట్టాల్సిన పక్షికన్ను బాణానికొచ్చి దిగుతుందా
ఎక్కుపెట్టక ఓడిన వాడికి క్షమాపణ ఉంటుందా
ప్రయత్నం అక్కర్లేనిది పతనాల లోయల్లోకే
ఉన్నచోటే ఉంటే తలొంచదు విజయ శిఖరం నీకై
నిన్ను నువ్వే చెక్కుకుందామని మొదలెడితె
క్షణాలు ఉలులై నీ చేతికి దొరుకుతాయ్ లే గుండెల్లో
2 Responses
  1. వాహ్...మా సిరివెన్నెల గారిని తలపించారు.అస్సలు ఒక్కో అక్షరం ఎంత పవర్ ని నింపుకున్నాయో?నిజమే మీరు చెప్పిన ప్రతీ మాటతో ఏకీభవిస్తున్నాను.
    మరిన్ని రాయండి.


  2. Anonymous Says:

    అదిరింది.
    మీ బ్లాగులలో ఇలాంటివి చూడంటం మొదటి సారి.