Your Ad Here

నాకే అంకితం


నే జయించిన క్షణం యుగాల నిర్నిరీక్షణం
నేడుదయించిన రస వనం శిశిర మధన తపో ఫలం
యుగ యుగాల రసవృష్టిని క్షణాలుగా కుదించాను
నా క్షణాల రససృష్టిని యుగాలుగా తలంచావు
అనాదుల పునాది పైన అనంత నిర్మాణం
.....నా కవిత్వం
****
శారదాక్ష కటాక్ష వీక్షణా లబ్ద విభావాభిరామం
నవరసామృతాభిషిక్త సారస్వత సాలగ్రామం
నా మానసం ఒక నైమిశం
మానసం హరి పాదమై ఉబికి పొంగే గంగా ప్రవాహం ఆలోచనం
కవన తృష్ణను భగీరధ ప్రయత్నాన కదిలే సుర ఝరీపాతం భావావేశం
మనసే మహాదేవ శిరసై ఉరికే అక్షరాభిషేకం కవనం
మనసే నింగి... మనసే పొంగి...
నను నేను అభిషేకమొనరించు ఘట్టాన అభిషేక జలమే నీ పాలిటి కవిత్వం