Your Ad Here

నాకే అంకితం


నే జయించిన క్షణం యుగాల నిర్నిరీక్షణం
నేడుదయించిన రస వనం శిశిర మధన తపో ఫలం
యుగ యుగాల రసవృష్టిని క్షణాలుగా కుదించాను
నా క్షణాల రససృష్టిని యుగాలుగా తలంచావు
అనాదుల పునాది పైన అనంత నిర్మాణం
.....నా కవిత్వం
****
శారదాక్ష కటాక్ష వీక్షణా లబ్ద విభావాభిరామం
నవరసామృతాభిషిక్త సారస్వత సాలగ్రామం
నా మానసం ఒక నైమిశం
మానసం హరి పాదమై ఉబికి పొంగే గంగా ప్రవాహం ఆలోచనం
కవన తృష్ణను భగీరధ ప్రయత్నాన కదిలే సుర ఝరీపాతం భావావేశం
మనసే మహాదేవ శిరసై ఉరికే అక్షరాభిషేకం కవనం
మనసే నింగి... మనసే పొంగి...
నను నేను అభిషేకమొనరించు ఘట్టాన అభిషేక జలమే నీ పాలిటి కవిత్వం
4 Responses
  1. నేను మరో పోలిక వెదికి చెప్తున్నానండి. మీ "మనసే అందాల బృందావనం" అట జనించు కైతలే గోపికలన్నమాట. అవి అంకితమయ్యే మీరే నంద గోపాలుడూను. గోపీలోలుని లీల జీవాత్మ-పరమాత్మల ఐక్యం. మీ మనసున జనించిన కవనం మీకే అంకింతం.



  2. థాంక్సండీ ఉష గారూ నా ఈ కవిత మొదట చదివిన నాటి నుంచీ ఆక్షేపణలో ఆరోపణలో వినడం అలవాటు పడ్డ నాకు మీరు సపోర్ట్ చేసి రాసిన కామెంట్ చూడగానే చాలా ఆనందం కలిగింది
    @సుజీ గారు
    థాంక్స్


  3. oremuna Says:

    Kindly drop me a mail

    chavakiran @ gmail . com