"ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనురాగమౌనో"అంటూ చివరికి ప్రేమికులిద్దరూ ఆత్మహత్యచేసుకుని ప్రేమని బతికించిన(?) మరోచరిత్ర గుర్తుందిగా.ఆ సినిమా వెనుక ఓ విషాదముంది. ఆ సినిమా చూసి సరాసరి చెన్నై మెరీనా బీచ్ దగ్గర్లో సూసైడ్ పాయింట్ మీదనుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.దానికిపశ్చాత్తాపపడి ఆత్మహత్యల్ని వ్యతిరేకిస్తూ "అక్టోబర్ 1 "అనే సినిమా తీసాడు.
కానీ చనిపోయిన ఆ ప్రేమికుల జంటను వెనక్కి తేగలిగాడా?
*****
"అపరిపక్వమైన భావాలు కలవారు మహా కావ్య రచనకు అనర్హులు" అంటోంది సనాతన భారతీయ దృక్పథం.మహాకావ్య కర్తలు మాత్రమే కాదు సమాజాన్ని ప్రభావితం చెయ్యగల ఆవిష్కర్తలు,సృజన కారులు ఎవరికైనా వర్తించే మహాద్భుత వాక్యమిది.సాధారణంగా విస్తృతమైన సాహిత్య పరిశీలన,చక్కటి వ్యవహార జ్ఞానం పరిపక్వతకు ముఖ్యం.
పై రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా అపరిపక్వ భావనలకు ఆస్కారముంది.
పైన చెప్పుకున్న విధంగా పరిణతి చెందని భావనలతో,తన ఆవిష్కరణ లేదా కావ్యం యొక్క ప్రభావం పట్టించుకోకుండా వాటిని ప్రజల్లోకి తెస్తే ఆ తప్పుడు భావాల ప్రభావం ఆ ఆవిష్కరణ వల్ల ప్రమాదం ప్రజలమీద పడుతుంది.ఆ తర్వాత అదే రచయితో,శాస్త్రవేత్తో పరిణతి చెందాకానో,ప్రభావం తెలుసుకున్నాకానో ఆ రచనకు పూర్తి వ్యతిరేకమైన కోణంలోకి తన భావధార దారి మళ్లాకా అతని బాధ వర్ణనాతీతం.
చలం తన యౌవనంలో నాస్తికుడిగా ఉన్నప్పుడు ఎన్నో రచనలను ఆ కోణంలో చేసాడు.తద్వారా ఎందర్నో ప్రభావితంచేసాడు.తన జీవితపు ఆఖరు పేజీల్లోకి వచ్చేప్పటికి భగవత్ దర్శనం కోసం తపించిన ఆస్తికుడిగా మారిపోయాడు.గిరిప్రదక్షిణం చేస్తున్న రమణ మహర్షి దారికి అడ్డంపడి "స్వామీ మీ కరుణ కావాలి"అని ఆక్రోశించేవాడు(ప్రతీ రోజూ అదేఅడిగేవాడట.ఒక నాడు మహర్షి "అదిదా ఎప్పుడూ ఉండాది"అన్నారట(సూర్యుని వెలుగు సూర్యుడు ఉన్నంత సేపూ ఉంటుంది నువ్వు బిడాయించుకున్న తలుపులు తెరిచి రావాల్సింది నువ్వే కానీ గదిలో కూర్చుని వెలుగు కావాలంటే సూర్యుడు మాత్రం చేసేదేముంది అని తాత్పర్యం అయ్యుంటుంది))
తన మటుకూ తను ఆస్తికుడైపోయాడు(ఆ మాటకొస్తే మహా భక్తుడయ్యాట్ట) చలం.అంతకు ముందు నాస్తికునిగా ఉన్నప్పుడు ఆ దృక్పథంలో రచనలు,వాటి వల్ల ప్రభావితమైన వ్యక్తులు,అందుమూలంగాతల్లకిందులైన జీవితాలు వీటికి నైతిక బాధ్యత ఎవరిది?
*****
కవులూ,సినిమా దర్శకులే కాదు ఆధునిక శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడని ఎత్తుపీట మీద కూర్చున్న ఐన్ స్టీన్ అణుబాంబును ఆవిష్కరించగల డిస్కవరీ కనిపెట్టి పర్యవసానాలు ఊహించకుండా వెల్లడించాడు.తర్వాత అర్ధమయ్యాకా ఎంతోబాధ పడ్డాడు."ఇలా జరుగుతుందని ముందే తెలిసి ఉంటే చెప్పులు కట్టుకుని బతికేవాడిని గానీ లాబ్ వంక చూసే వాడిని కూడా కాదు"అన్నాడు ఆ సందర్భంలో.
*****
"సముద్రంలో తిమింగలాలు ఎన్ని కలిసినా ఎంత ఎగిరినా ఒక్క అలను కూడా తీరం తాకించలేవు.
అదే కొలనులో ఒక చిన్న రాయితో కొట్టినా అలజడి పుడుతుంది"
అనే భావంతో ఒక సంస్కృత శ్లోకం ఉంది(అది గుర్తు రావట్లేదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి).మహనీయుల ఆలోచనల అలజడి వారిలో భావోద్వేగం కలిగించలేదని,మామూలు వారి చిన్న ఆలోచన తునక కూడా ఉద్వేగాలతో వాళ్ళని ఎత్తి కుదేస్తుందనే ఉద్దేశ్యం కలిగిస్తుంది ఆ శ్లోకం.
మన దగ్గరకొచ్చాకా పాయింటేమిటి అంటే యోగంతో శరీరాన్ని లొంగదీసుకున్న సముద్ర సములైన మహనీయులు "టైం ఎంత"అంటే "పావు తక్కువ తొమ్మిది"అన్నంత మామూలుగా చెప్తాడు ఒక మహా సత్యాన్ని.అదే ఆ సెల్ఫ్ కంట్రోల్ లేనివాడు చిన్నదో,పెద్దదో ఆలోచన మనస్సున తళుక్కుమని మెరవగానే దాని పర్యవసానాలను ఆలోచించడు.ఆ ఉద్వేగంలో "యురేకా"అని గీపెట్టి బట్టల్లేకుండా బాత్ టబ్ లోంచి వీధుల్లోకి పరిగెడతాడు.కొలనులో అలల్లా చాలాసేపు ఊగి ఊగి ఊర్కుంటాడు.ఆ ఊపులోమంచి చెడులు ఆలోచించి పరిశోధన ఫలాలు వెల్లడిద్దామన్న వివేకం చస్తుంది.
తన గొప్పదనం పదిమందికీ తెలియాలనే ఉబలాటంలోనో,కాలంపై సంతకం చేస్తున్నాననే ఉద్వేగంలోనో కాక తమ రచనల వల్ల,పరిశోధనల వల్ల పదిమందికీ ఉపయోగపడాలనే పరిణతి కావాలి ఆ ద్రష్టలకు,స్రష్టలకూను.
*****
అంతవరకూ ఎందుకు ఏనాడో ఎవడో కాని మోకాల్లోతు నీళ్ళతో నిండిన మచిలీపట్నం బస్టాండ్ చూసి దాన్నిఉపమానంగా వాడి "ఛీ బతుకు బందరు బస్టాండ్ అయిపోయిందిరా"అన్నాట్ట.దెబ్బకి అదో జాతీయమైపోయింది.
మొన్నో బందరాయన ఆ మాటకు "ఇప్పుడు బందరు బస్టాండ్ మారిపోయింది.ఆ మాట ఎప్పటికి మారుతుందో"అని బాధపడ్డాడు పాపం(బందరు వాళ్ళకి ఆ ఊరంటే బాగా ఎక్కువ అభిమానం లెండి).
బందరు బస్టాండ్ అన్న మాటకీ సిగ్గుతెచ్చుకుని బస్టాండ్ బాగు చేసుకుంటే ఏమో గానీ లేకుంటే ఆ అజ్ఞాత కవిని బందరూ,బందరు బస్టాండు క్షమించలేవు.కాదంటారా.

Present now also "Bandar bus stand" situation is liek that - no changes at all -- in 2007-08 we went to bus stand through boats - so imagine it.
అయితే మా బందరుడు నాకు మస్కా కొట్టాడన్న మాట
ఐనా ఆ ఒక్క ఎగ్జాంపుల్ తప్పేమో గాని మిగతావన్నీ కరక్టే లెండి
సంతోష్ సూరంపూడి
chala deep thinking undi mee post lo
particularly about Chalam - Aayana rasina pusthakalu (before turning into Nasthikudu) entha mandi meeda prabhavam choopayo. Same goes to Sri Sri.