Your Ad Here

దేవుడా నాకు అమ్మాయిలు అర్ధం కారు


వాన ఎప్పుడొస్తుందో తెలీదు కానీ తడిసేది మనమే.
ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు కానీ పోయేది మనమే.
ప్రకృతి ఒక పజిల్ అందులోనే క్లూ ఉంటుంది.దమ్ముంటే విప్పొచ్చు.
కానీ గజిబిజితనం తప్ప ఏమీ ఉండదు.ఉల్లిపాయ పొరల్లా.అందుకే అలా ఆస్వాదించడమే కరెక్ట్.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అమ్మాయిలైనా అంతే.
*****
ఒక రోజు పొద్దున్నే అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది.నిన్ను హర్ట్ చేసినందుకు సారీ ఇంక నాతో మాట్లాడు అని.
అసలు సారీ చెప్పేంత తప్పేం చేసింది మనకి గుర్తు రాదు.
పోనీ అలా మేనేజ్ చేద్దామనుకుంటే కాసేపటికి అసలు అంతగా ఎందుకు ఫీల్ అయ్యావు అంటుంది.
ఏం చెప్పాలి అమ్మా తల్లీ నాకసలు నువ్వేమన్నవో గుర్తు కూడాలేదు అంటే వదులుతుందా అబ్బే ఐతే ఇంకా కోపంపోలేదన్నమాట.లేకపొతే ఎందుకు సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నావు అంటుంది.
మాట్లాడటమే రాదు ఇంక సర్కాస్టిక్ గా మాట్లాడడం ఒకటి అనుకుని" ఊర్కో నిజంగా అసలు కోపమూ లేదు గుర్తూలేదు ఇంతకీ ఏమన్నావ్"
అంటే రెండు జరగొచ్చు "హమ్మయ్య అసలు కోపమే రాలేదా థాంక్యూ సో స్వీట్" అనొచ్చు
"మా మాటలెందుకు గుర్తు పెట్టుకుంటారు మీరు అనొచ్చు.
దేవుడా నాకమ్మాయిలు అర్ధం కారు.
*****
పైగా ఈ వైనానికి తోడూ ఆ మాట్లాడడం ఒకటి.
ఏదైనా ఎవరికీ చెప్పకు అనడం ఆలస్యం గొప్ప రహస్యమేదో దాయబోతున్నానన్న ఆనందం అణుచుకోలేక ఆ సంతోషం లో ఎవరో ఒకరికి చెప్పేస్తారు.
అబ్బాయిలకి ఏమైనా చెప్తే ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తారు.
అదే అమ్మాయిలకి చెప్తే చెవితో విన్నది నోటితో వదిలేస్తారు.
*****
భలేక్రిష్ణ సినిమా చూసి తలపోటు వచ్చి కూర్చుంటే "సినిమా ఎలా ఉందన్నయ్యా"అని అడుగుతుందనుకోండి.
"నీ మొహంలా ఉంది"అని క్యాజువల్ గా అంటాం.
ఠక్కున "ఏం నా మొహం బావోదా"అనేస్తుంది.
"అబ్బే సినిమా బావుంది"అనవలిసి వస్తుంది.
అప్పుడు రెండు జరగొచ్చు.కిలకిలా నవ్వి ఊర్కోవచ్చు లేదో "ఐతే పద సినిమాకెళ్దామ్"అనొచ్చు.(బాంక్ బాలన్స్ అమ్మకి అప్పచెప్పి,కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి బాధ్యతలు అప్పచెప్పి సినిమాకి వెళ్ళవచ్చు)
*****
అదే కాదు ప్రతీ సారీ చిన్న మాటకీ కూడా హర్ట్ అవుతారు.
చిన్న విజయాల్ని కూడా గొప్పగా ఆస్వాదిస్తారు.
చిన్న చిన్న విషయాలకి కూడా తెగ ఆలోచిస్తారు.
పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా చటుక్కున తీసేసుకుంటారు.
ఒక్కో సారి ప్రేమే జీవితం అంటారు.
ఒక్కసారే
కంఫర్టబుల్ గా దాన్ని మర్చిపోయి కంఫర్ట్ లైఫ్ వెతుక్కుంటారు.
ఎప్పుడూ ఉద్వేగాల అలల్లా ఎగిసి పడుతుంటారు
జీవితంలో విపరీతమైన బాధో విపరీతమైన ఆనందమో తప్ప మధ్యలో ఏమీ లేనట్టుగా ఉంటారు.
they are extreme at any point of time
*****
వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో
ఎప్పుడు ప్రేమ కలుగుతుందో
ఎందుకు సంతోషిస్తారో
ఎందుకు విసిగిస్తారో
ఏం దాస్తారో ఏం చెప్పేస్తారో
అసలు ఊహలెంతో అంత ఉద్వేగం ఎందుకో
ప్రతీది ఎందుకు ఎక్కువ ఆలోచిస్తారో.
నిజానికి ఆ కన్ఫ్యూజన్ లోనే అందముందేమో.అసలు అర్ధం చేసుకుంటే ఈ అందం ఉండదేమో.
*******
" దేవుడా"
ఆకాశం లోంచి మాటలు వినిపించాయి "బాబూ ఎందుకు అరుస్తున్నావ్.నేను ఎక్కడ పడితే అక్కడే ఉంటాను.అలాగనినాకు చెవుడు కూడా లేదు"
"స్వామీ పరంధామా నాకు ఎందుకు అమ్మాయిలు అర్ధం కారు"
"నీ బొంద నాయనా నాకే అర్ధం కారు.ఒకప్పుడు కాళ్లుపడతారు ఒకప్పుడు కాళ్ళు పట్టుకున్నా తంతారు."
"ఓహో వాసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టు కుంటే తన్నిందని అదేనా స్వామీ"
"అది వేరు ఇది వేరు. సీన్ పేరు 'క్షణ క్షణముల్ అమ్మాయిల చిత్తముల్'"
"అంటే"
"చిత్తే వాతం కపూ"
"మళ్లీ ఇదేంటి"
"నాకే డౌట్ వచ్చే క్వశ్చన్లు వెయ్యొద్దు అని అర్ధం"
10 Responses
  1. Anonymous Says:

    hello masteru,
    bhale correct ga chepparu......
    manam iddaram okkela vunnamu........
    naaku kudha idhe feeling.....


  2. prathibha Says:

    అమ్మాయులకు అబ్బాయులు అర్థం కారు........అబ్బాయులకు అమ్మాయులు అర్థం.....కారు.....


  3. asha Says:

    ప్రతిభగారు బాగా చెప్పారు.
    అర్ధమైపోతే ఏ గొడవలూ ఉండవనీ ఇలా ఉన్నామనుకుంటా...


  4. nuthakkis Says:

    ayyababoii baaga chepparu. Mari vaallu iddaru vere vere jeevulu kadandi :) Poni iddaru abbayilani teesukundam... are you sure you can understand the other person.. nope !! idi anthe shrusti mahatyam.. leka potee inka fun emuntundi.


  5. @ప్రతిభ గారు,@భవాని గారు,nutakkis గారు
    నాకు తెలిసినంత వరకూ ఎంతో తెలివైన అబ్బాయిని మామూలు అమ్మాయి కూడా అంచనా వెయ్యగలదు కానీ ఒక మామూలు అమ్మాయిని ఎంతో తెలివైన అబ్బాయి కూడా అంచనా వెయ్యలేడు.
    అనామకుడు,రాధిక,చిన్ని గార్లకు
    కృతఙ్ఞతలు
    ---సంతోష్ సూరంపూడి


  6. karthik Says:

    అమ్మాయిలను అర్థం చేసుకోవాలని ట్రై చేసే దేవదాసు అట్ల మట్టికొట్టుకుపోయాడు. :) :)
    నేను ఇంత చెప్పినా ప్రజలకు బుద్ది రాదు. అందుకే అలాంటి వారి కొసమని ఒక స్పెషల్ టపా రాశాను.
    http://nenu-naa-svagatam.blogspot.com/2009/02/blog-post_20.html

    -కార్తీక్


  7. Anonymous Says:

    abbayilaku vallento valle ardham karu. inka ammayilem ardham avutharu


  8. Anonymous Says:

    asalu ammaiyilani artham cheskotam ippudu antha avasaramaaaa? asalu avasaramaaa anta !!!

    enchakkaa, abbailatone friendships chesi, pelli light teeskovachu kadaa, arthamayye abbailatone snehameraa jeevitam, snehemeraa saswatam anukuntu undipovachu, artham chesukovalanukodam enduku, matti kottuku potam enduku ? emito, naaku ammayile kaadu, abbailu kooda artham kaaremo !


  9. Anonymous Says:

    haha, good post


  10. Rajesh Says:

    chala baaga chepparu u r right