"అసలు అమెరికా ఏంటి? ఆర్ధిక సంక్షోభమేంటి? ఈ గోలేంటి"ఓ సందాల తీరిగ్గా ఉన్నప్పుడు అడిగాడు మా ఆనంద్ శ్రీనివాస్.
అబ్బ దొరికాడు అనుకుని మొదలెట్టా"చెప్తాను గానీ,దీనికి సమాధానం చెప్పు. మిల్లులో పని చేసే ఒక ఐదు వేల జీత గాడు వచ్చి ఒక కోటి రూపాయలడిగాడనుకో ఇస్తావా"
" ఐదు వేలు సంపాదన పెట్టుకుని నాలుగు జన్మలు వెట్టి చాకిరీ చేసినా తీరదు దాని అప్పు.ఇవ్వను."
నేనందుకున్నాను"కానీ అమెరికాలో బ్యాంకులు ఆమాత్రం కూడా ఆలోచించలేదో ఏమో అప్పిచ్చాయి అదీ చాలా మందికి అప్పులు తీర్చలేక ఎగేసేసారు చాలా మంది.బ్యాంకులు దివాలా తీసాయి.మెల్లిగా అమెరికా దివాళా తియ్యటానికి రెడీగా ఉంది".
ఆనంద్ గాడు అర్ధమయ్యీ అవ్వనట్టు,"మరి బుష్ ఏం చేసాడు"అన్నాడు."ఏమో అమెరికా తగలడుతుంటే ఫిడేలు వాయిద్దామని మ్యూజిక్ క్లాసులకి వెళ్లుంటాడు".
ఏదో కనిపెట్టిన వాడిలా ఓ దిక్కుమాలిన ఎక్స్ ప్రెషన్ ఇచ్చి,"అదే మా వై.ఎస్. అమెరికా ముఖ్యమంత్రి అయ్యుంటేనా ఇంత గొడవ లేకుండా అప్పులన్నీ ఋణమాఫీ పెట్టి ఎత్తించేద్దుడు" అన్నాడు. దెబ్బకి జడుసుకున్నా వాడి థియరీకి అంతే హహప్పుడు మొహహదలైంది హీ హెదవ
నహవ్వు
అదే మా వై.ఎస్. అమెరికా ముఖ్యమంత్రి అయ్యుంటేనా...
హ హాహా... భలే చెప్పారండి మీ ఫ్రెండు
@చైతన్య
కృతఙ్ఞతలు,నిజానికి ఆ ఫ్రెండ్ కూడా నేనేలెండి
--సంతోష్ సూరంపూడి