Your Ad Here

తెగులు పాటల గోల

ఏ వచ్చి బీ పై వాలె
బీ వచ్చి సీ పై వాలె
సీ వచ్చి డీ పై వాలిందే
వన్ వచ్చి టూ పై
వాలె టూ వచ్చి త్రీ పై వాలె
త్రీ వచ్చి ఫోర్ పై
ఏబిసీ అంటే నాలో అందం వన్ టూ త్రీ అంటే నీలో వేగం "

ఏదో ఒక అర్ధం కనీసం బూతు అర్ధమైనా ఉండాలన్న నా భ్రమలు పటాపంచలు చేసిన పాట ఇది.సిట్యుఏషన్ కీ పాటకీ సంబంధం ఎలాగూ లేదు కనీసం డబుల్ మీనింగ్ ఐనా ఉంటుందనుకున్నా.అదీ దొరకలేదు.తట్టీ తట్టని పొడుపు కథలా చిత్ర హింస పెట్టి తర్వాత తెలుగు పాటకు అర్ధమే కాదు పర్ధం కూడా ఉండాల్సిన పని లేదని ఙ్ఞాన బోధ చేసింది.

ఇలాంటి పాటల్లో మరో మణిపూస
బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో కారెక్కి వస్తావో రైలెక్కి వస్తావో"
ఏజంటులా మొదలెట్టాడేంట్రా బాబూ అనుకుంటూండగా.
"ఏదైనా ఎక్కేసెయ్ రా నా ఎదలో పక్కేసెయ్ రా "అంటుంది హీరోయిన్...ఇక ఆ కపిత్వ జల్లుల్లో తరించి తీరాల్సిందే గానీ చెప్తే వినవలసిన భావం కాదది.
మరో పాటలో
ఒరేయ్ నువ్వు నాకు నచ్చావురా ఒరేయ్ ఐలవ్యూ రా ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా ఒరేయ్ అదంతేరా"
అనిపిస్తాడా సినీ కపి.
సడన్ గా
ఆడపిల్ల ఒరేయ్ అందంటే ప్రేమలోన పడ్డట్టేరా" అని డిక్లేర్ చేస్తాడాయన..యుగయుగాలుగా మహామహులెందరో ప్రేమకు ఇంత డెఫినెట్ డెఫినిషన్ ఇవ్వలేదు.వీలుంటే పై వాక్యం ఆటోల లారీల వెనకాలా రాసుకుని గర్వించాలి.
ఇలా చెప్తూ పోతే.
"జడ పెట్టి కొడితే జబ్బరుపేట్లో పడతావ్ ఓరబ్బీ కొట్టేయనా.."
"చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే"
లాంటి జాతిరత్నాలు ఎన్నెన్నో.
పోనీ నేరం కాదు డైరెక్టరుది అన్నట్టు అవన్నీ ఆ స్థాయి పాటలు అనుకుందాం "తెలుగు భాష తీయదనం" అనే పాట సందర్భం ఉన్న పాట.పాపం ఆ పాట రాసినాయన మాత్రం తెలుగు భాషా సంఘం వారి గోడల మీద ఆర్టీసీ బస్సుల్లోనూ తెలుగు గురించి రాసిన సూక్తులు చక్కగా ఓ పుస్తకం లో ఎక్కించుకుని వచ్చి ట్యూన్ లో ఇమిడ్చేసి ఇరగదీసేసారు.
*****
ఎప్పట్నించో తెల్లవారుఝాముల్లో లేచి మరీ ఓ కల కని పడుకుంటున్నా. ఇలాంటి పాటలు(కనీసం ఏ అర్ధమూ లేకుండా) రాసేవాళ్లను అందర్నీ తెప్పించి ఆంధరికీ నిక్కర్లు వేసేసి లైన్ లో నుంచోబెట్టాలి. మాంఛి పచ్చి తాటి కమ్మ(కొసలు బాగా సూదిగా ఉండి దిగిపోవాలన్నమాట) ఒకటి పురమాయించి,దాంతో మోకాళ్ల కింద బాదుతూ...
నేను:ఇంకెప్పుడైనా (దెబ్బ
సదరుడు:అమ్మోయ్
నే:ఇంకెప్పుడైనా (మళ్లీ దెబ్బ)
స:అబ్బోయ్
నే:ఇంకెప్పుడైనా అలాంటి పాటలు రాస్తావా (దెబ్బ)
స:రాయనూ రాయనూ
నే:అలాంటి పాటలు
నే:మళ్లీ
నే:పారిపోకు దొరికితే చంపేస్తా
*****
మీరే నా పాలిటి తథాస్తు దేవతలు.ఓఖ్ఖసారిగా తథస్తు అనాలి సరేనా....1...2...3....
22 Responses


  1. Sai Praveen Says:

    నిజమే బ్రదర్. అస్సలు అర్ధం పర్ధం లేకుండా మొత్తం పాత రాసేయచ్చు అనడానికి బెస్ట్ example "ఏ వచ్చి బీ పై వాలె".
    "వీలుంటే పై వాక్యం ఆటోల లారీల వెనకాలా రాసుకుని గర్వించాలి." - ఇది సూపర్ :)


  2. avunu dubbing paatalaki original ki kooda theda undatledu..


  3. మరీ అలా తీసెయ్యకండే ఇలాంటి పాటల్లో కొన్ని నన్ను బాగా inspire చేసినవి కూడా వున్నాయి. ఫరెజ్జాంపుల్ అదేదో సినిమాలో "మధుమాసం" అన్న పదాన్ని ఇరగదీసి అరగదీసి దాదాపు ఆ పదంతోనే పాటమొత్తం కానిచ్చేశారు కవివర్యులు (దానికి గాత్రం రమణ గోకుల గారు). అదివిన్నాక "ఓసోస్ ఇంతోటి పాట నేనూ రాసెయ్యగల" ననుకొన్నాను. అంతగా కదిలించిందా పాట నన్ను :).


  4. హ్హ.. హ్హ.. హ్హ.. తథాస్తు.


  5. హ..హ..హ..హ..తథాస్తు.


  6. మీరు
    "ఓం నమస్తే బోలో బేబీ, ఓం నమస్తే బోలో దిల్ మే డాష్ కొట్టే పార్టీ టైం లో
    ఓం నమస్తే బాబా ఓం నమస్తే బోలో నీతో పార్ట్ నర్ అవుతా ఫ్యూచర్ క్రైం లో"

    పాట ఎప్పుడైనా విన్నరా, ఈ పాట నేను చాలాసార్లు విని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాను.ఊహూ నావల్లకాలేదు. ఏం క్రైం చేస్తారు, ఎందుకు డేష్ కొడతారు...అబ్బే, లాభం లేదని వదిలేసాను.

    మీ కల నెరవేరాలని కోరుకుంటున్నాను.

    నేను పాటల మీదకాదుగాని తెలుగు మీద (అంటే పాటలని కలుపుకుంటూ) ఒక పోస్ట్ రాసాను, చూడండి.
    http://vivaha-bhojanambu.blogspot.com/2010/04/blog-post_09.html


  7. This comment has been removed by the author.

  8. మీ బాధకు నా సహానుభూతి!మీరు మొదట పేర్కొన్న పాటలో "ఉంగుడుగుడు గుడు గుడు"అని ఒక శబ్దం ఉంటుంది.అదేంటో అర్థమై చావట్లా!ఇలా అర్థం కానిపాటల లిస్టు రాసుకుంటూ పోతే ఒక రీము(అనగా 24 దస్తాలు!దస్తాకి 24 ఠావులు)కావాల్సివస్తుంది.

    Indian minerva, మీరు మరీనండి, రమణ గోగుల ఏ సాహిత్యాన్ని ఎలాగైనా చంపేయగల్డు!


  9. ఈ సంధర్భంలో నాకో జోకు గుర్తొచ్చింది. భ.ర.గో గారి చిరకాల మిత్రుడు అమెరికానుండి వచ్చిన సందర్భంలో "తెలుగు సినిమా చూసి చాన్నాళ్లయింది, వెళదాం రారా" అన్నాట్ట.

    భ.రా.గో గారేమొ "వద్దురా, నువ్వుభరించలేవు, మనకాలమనుకున్నవా, కానే కాదు ఇంటిదగ్గారే కబుర్లు చెప్పుకుందాం అన్నారట". "ఊహు లేదు వెళ్లాల్సిందే" అన్నారటా ఆ స్నేహితుడు. సరే కానీ అని వెళ్లారట.

    అందులో మోకాలు ఊపుకుంటూ, నడ్డి ముదుకి వెనక్కి తిప్పుతూ డేన్సులు వేస్తూ పాడుతున్నరట. కాసేపయ్యక ఆ మిత్రుడు అడిగాడట "ఓరేయ్ ఆ పాటకి అర్థమేమిటంటావ్?" అని

    భ.రా.గో గారికి చిర్రెత్తుకొచ్చి "మనసునమల్లెల మాలలూగెనే" అంటే అర్థం చెప్పగలను కానీ "డింగుటక ఆహా డింగుటక ఓహో డింగుటక" అంటే ఏమి చెప్పమటావురా" అన్నారట.


  10. Anonymous Says:

    sowmya, mee joke super!


  11. Anonymous Says:

    మనసునమల్లెల మాలలూగెనే

    can you tell me the meaning of this
    this too word one cant explain


  12. సౌమ్యగారూ..సూపరండీ.

    భ.రా.గో గారి జోక్ నేనూ చదివానండీ.


  13. కొత్త పాటలని వినడం మానీసి పదేళ్ళవుతోంది. అయినా ఎదో దిగులు - కొంపదీసి "మన తెలుగు సాయిక్షం మిస్ అయిపోతున్నానేమో" నని. మొత్తానికి పొయ్యేదేం లేదన్న భరోసా దొరికింది. వీలుంటే నా "రియార్సల్సులు" చదవండి.

    సూర్య
    (www.suryamahavratayajula.wordpress.com)


  14. t Says:

    తధాస్తు mastaru. chala baga rasaru. mana praarabdham ide anukoni santhoshinchali. mana kaveeswarulu thama కపిత్వ జల్లుల్లో manalni inkenta munchi mudda chestaro bhavishyattu lo choodali.


  15. Reeha Sharon Says:

    WOWWW SANTOSH I DIN KNOW WERE A BLOGGER....THREE CHEERS TO YOU.


  16. వేణురాం,సాయి ప్రవీణ్,శివ చెరువు,శిశిర,శివరంజని,అనామకులు,ప్రణీత స్వాతి,సి.హెచ్.ఆదిత్య గార్లకు

    కృతఙ్ఞతలు
    @ఇండియన్ మినర్వా,
    రమణ గోగుల గారి గురించే చెప్పారా చెప్పక చెప్పక ఆయన దొరికితే మర్డర్ చెయ్యాలన్నంత అభిమానం పెంచుకుని తిరిగేవారు ఆయన సినిమాలు చేసే కాలం లో

    సౌమ్య గారూ,
    మీరు చెప్పిన భరాగో గారి జోకు అదిరిందండీ.ఆ జోకు చెప్పిందుకు మీకు ఓ డింగుటకా.

    సుజాత గారూ,
    ఆ ఉంగుడుగుడుగుడు గుర్తు వస్తే నేనేదో బ్రహ్మ హత్యా పాతకమో,మరేదో చేసిన ఫీలింగ్ వస్తూంటుంది నాకు.సరే మీకూ ఒక ఉంగుడుగుడుగుడు.

    సూర్య గారూ,
    మీరు అదృష్టవంతులు.మా లాంటి వాళ్లు కొత్త పాటలు వినకా మానరు.వినీ ఊరుకోలేరు.అలా అని ఏ మర్డరో చెయ్యనూ లేరు.కృతఙ్ఞతలు
    --సంతోష్ సూరంపూడి.


  17. @crystal gal,
    thanQ n cheers 2 u too
    who r u
    i guess u may b reeha or bhanu
    am i right
    --santosh(siddhu)


  18. ఈ ఏ వచ్చీ బీ పై వాలే కీ ఎంసెట్ కీ అవినాభావ సంబంధం ఉందని మా ఇంటర్ చదివే రోజుల్లో వీకెండు టెస్టులు రాసేప్పుడు అనుకునే వాళ్ళం!


  19. మనం మంచి సాహిత్యం రాసిచ్చినా అది సినిమా పాటకు పనికి రాదు నోరు తిరగని కిలిమంజారోలు అస్కావాలూ కావాలి సినిమా పాటలకి.
    ఇంతకీ CGR లో పాటలు విన్నారా, వింటే ఈ టపాకు పొడిగింత రాసేస్తారు


  20. Unknown Says:

    "మాంఛి పచ్చి తాటి కమ్మ"
    కొంచెం వైలెంట్ కల కన్నట్టున్నరే?