Your Ad Here

పరుగు

బతుకంటే కాలం వెనుక అలుపే లేని పరుగు
శ్వాసంటే అదుపే లేని పరుగుల వల్ల ఒగుర్పు
అమ్మ కడుపులోనే మొదలైంది కదిలే లక్షణం
నెత్తురంటే ఈ నీ బండిని నడిపే ఇంధనం
జడుసుకుని తడబడే నడకకి నగరమే
నట్టడివిరా దమ్ముగా పడే అడుగులకి ప్రపంచం హైవే అవుతుందిరా
చల్ చల్ చల్ అంటే బతుకే పరుగురా
హట్ హట్ హట్ అంటూ దారే వెతకరా బతుకంటే
కెరటం నాకు నేర్పింది ఎగిసే లక్షణం
సుడిగాలి నించి వచ్చింది దూసుకెళ్లే గుణం
ఎగసే వేగాలకన్నా దారి విలువైనది
అని గురి దూరమైన బాణం నాతో అంటున్నది
ఐనా సైకిల్ రైడ్ లా సాగితే థ్రిల్లేమున్నది
రోలర్ కోస్టర్ లాంటిది జీవితం అన్నది చల్ చల్ చల్

పూలూ-పడగలు

తెల్లవారుజాము మూడున్నరైంది టైము.ఆ రోజు సుబ్రహ్మణ్య షష్టి.మా అత్తిల్లో సుబ్బారాయుడి గుడి కళకళ్లాడి పోతోంది. గుళ్లో గంటలు ఠంగు ఠంగున మోగుతున్నాయి.ఓ పక్క ఠపేల్ ఠపేల్మని కొబ్బరికాయలు పగిలిపోతున్నయి.పూజారులు వేదమంత్రోఛ్ఛారణలుఒ,మైకులో,"అమ్మా!లైన్నించి జరక్కండి.ఏం బాబూ ఎర్రచొక్కా తోస్తావేం.అందరూ ఐదు నిముషాలు అటూ ఇటులో దర్శనం చేసేసుకుంటాం....."అంటూ సూచనలు.ఇన్ని శబ్దాల నగిషీల మధ్య"పూలూ పడగలూ పూలూ పడగలూ ఒక్క రూపాయికి రెండు"అంటూ ఓ గొంతు తళుక్కుమంటోంది.ధర్మదర్శనం లైన్లో ఆచివర్నించి ఈ చివరివొరుకూ కలతిరిగేస్తూ అమ్ముతున్నాడు.ఆ పువ్వు మీంచి ఈ పువ్వు మీదకు వాలే తూనీగల్లా పూలూ పడగలమ్ముకునే పిల్లలు తిరుగుతూ అమ్ముకుంటున్నారు.అందరూ దాదాపు పది నించి పదమూడేళ్ల వయసుల వాళ్లే.కొందరు పిల్లలు "నేనడిగిన వాళ్లకు నన్నుతప్పించి అమ్మేసావ్",అంటూ ఒహళ్లనొహళ్లు తిట్టుకుంటున్నరు.కానీ అందర్లోకీ కలివిడిగా తిరుగుతూ అమ్ముతున్నాడో కుర్రాడు శీను గాడు.
"తెల్లారితే ఎండ ముదిరిపోద్ద"ని కొందరు,"చుట్టు పక్కల ఊళ్ళ వాళ్లు వచ్చే టయానికి వెళ్తే లైను పొడుగైపోతుంద,"ని కొందరు,పిల్లలు టిఫెన్లకాగలేరని కొందరూ తెల్లారుఝాము ఐదులోపే దర్శనానికొచ్చేస్తారు.కానీ,వీళ్లకు మల్లే ఆలోచించినోళ్లు గాబోలు అప్పటికే చాలామంది గుడికాడికొచ్చేస్తారు.శీనుగాడు కూడా అలా వాచ్చేవోళ్ల కోసవని,మిగతా కుర్రాళ్లు ఆరింటికొస్తారు కదా ఈలోపు అమ్మేసుకుందావని ఒంటిగంటకే స్నానం చేసి వచ్చేసాడు.కానీ మిగతా వాళ్లు కూడా అలాగే ఆలోచించి అప్పటికే దిగవడిపోయారు.
అప్పట్నించీ నోరవిసేలా అరుస్తూనే ఉన్నాడు.అమ్ముతూనే ఉన్నాడు."పూలూ పడగలమ్మా పూలూ పడగలు..!"ఎవరో అడిగితే చెప్తున్నాడు,"ఇవి హుండీలో వేస్తే మంచి జరుగుద్ది సార్"."ఇవిగోండి సుబ్రమణ్యేశ్ర సామికి ఇవంటే చాల ఇష్టవంట",రెండు మూడు వెండి పలుకుల్లాంటివి తీసి చూపించాడు.మళ్లా కాయితం పొట్లాం కట్టేస్కున్నాడు."ఇయ్యేనండి పూలూ పడగలంటే.మా అమ్మ మొక్కి హుండీలో ఏసిందంట ఈ సామికి.అబ్బాయ్ పుట్టాలని.అందుకే నేను పుట్టానండి",
"సర్లే ఒక రూపాయివి ఇవ్వు",
"ఒక్కొకరూ ఒక్కోటెయ్యాలండి",
"అలాగేలే ఐదివ్వు".
అలా అమ్ముతూ తెల్లగా తెల్లారేకా జనం బా తక్కువున్నారని,ప్రసాదాల దగ్గరకెళ్ళి పోయాడు.గరిటెడు చక్కర పొంగలి పెట్టారు అక్కడి బ్రాహ్మలు.గోపురానికి ఒక నమస్కారం పెట్టేస్కుని లాగించేసాడు ఆ ప్రసాదం.కోనేట్లో కాళ్ళూ చేతులూ మొహం కడుక్కుని మళ్లీ సందట్లోకీ పందిట్లోకీ వచ్చేసాడు.
పందిట్లో స్టేజ్ మీద కోలాటం చేస్తున్నారు.పురంధర దాసు కన్నడంలో రాసిన"దేవబందానమ్మ సామి బందానో",అనే పాటకి చేస్తున్నారు కోలాటం.జనం హోరు వరద గోదాట్లా ఉంది.మబ్బుల మాటున దాగిపోయిన సూర్యుడు చందమామలా ఉన్నాడు.జనం పెరిగిన కొద్దీ శీను గాడు ధనధనమని తిరుగుతూ పూలూ పడగల పొట్లాల్నీ కబుర్లనీ కలిపి అమ్మేస్తున్నాడు.తొమ్మిదో పదో అయ్యేపాటికి పాలి,రేలంగి,మంచిలి,కంచుమర్రు,ఈడూరు లాంటి దగ్గర ఊళ్ల వాళ్లు వస్తారు.భీమారం(భీమవరం),తణుకులాంటూళ్ల నించి పొద్దున్న వాళ్లూళ్లో దర్శనం చేసేసుకుని సాయంకాలం చల్లబాటున వస్తారు.మధ్యానం పన్నెండూ ఆ ప్రాంతాల్లో వీలు చూసుకుని ఓ పదినిముషాలు అన్నదాన సత్తర్వులో లోకెళ్లి ఓ బంతిలో అలా తినేసి ఇలా వచ్చేసేడు.
మధ్యానం జనం కొంత తక్కువున్నారు.సాయంత్రం ఊళ్లో వాళ్లు పునర్దర్శనానికి వస్తారు.వాళ్లకీ వెంటబడి అమ్మేడు,"పొద్దున్న తీర్చేసుకున్నాంలే",అని చాలామంది తీసుకోలేదు.చివరికి రాత్రికి కాళ్లీడ్చుకుంటూ ఇంటికి చేరేడు.శీను గాడి అమ్మా నాన్న ఉన్న ఎకరా కమత సాగు చేసుకుంటూ పక్కన ఓ రెండెకరాలు కౌలు చేసుకుంటున్నారు.పిల్లాడికి మంచి చదువు చెప్పించాలని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జేర్చేరు.పేటలో సాయంకాలమంతా ఆటలకి పోతాడు.కానీ క్లాసులో మంచి మార్కులొస్తాయి.శివరాత్రికి నత్తారామేశ్వరాన,ఊళ్లో షష్ఠికీ పూలూ పడగలూ అమ్ముతాడు.
తర్వాతి రోజు ఒళ్లంతా ఒకటే నొప్పులు,"యాభై రూపాయలు మిగిలాయి కదలే",అనుకుంటూ స్కూలు మానేసాడు.ఆ తర్వాతి రోజు స్కూలుకెళ్లాడు.క్లాసులోకి అడుగుపెట్టకుండానే,"నిన్నంతా నీ గురించే అడిగాడు డైరెక్టరు.రాలేదంటే ఇంటికెళ్లి తీసుకురమ్మన్నాడు,నీకు జ్వరమని చెప్పాను,స్కూల్కి రాంగానే ఆఫీస్ రూం కి రమ్మన్నాడు",అని బాంబు పేల్చేడు రాజేష్. భయంభయంగా ఆఫీసుకెళ్లి,"నన్ను రమ్మన్నారంట",అడిగాడు
"నేను కాదు డైరెక్టర్ సారు"అన్నాడు గుమస్తా.డైరెక్టర్ రూంకి గడగడా వణుకుతూ,"మే కమిన్ సార్",
"కమిన్",
లోపలికెళ్లాక పక్కరూంలో బెత్తం ఉంటుంది తీసుకురమ్మన్నాడు.ఏడుపుమొహంతో "సార్ సార్"అంటూ తెచ్చుకున్నాడు శీను."ఏరా కాన్మెంట్లో సదూకుంటున్నావా బోర్డిస్కూలో సదూకుంటున్నావా దొంగ నాయాలా.నిన్న పందిట్టో పడి పూలూ పడగలూ అమ్ముకుంటాంటే మన కాన్మెంట్ గురించి ఏవనుకుంటార్రా ఎదవా.నిన్నూ.."అని బెత్తం తీసి చెయ్యి పట్టుకుని బాదడం మొదలెట్టాడు.కాసేపట్లో చెయ్యి పెనమ్మీద పెట్టినట్టైపోయింది.
"మన పరువు"అని మళ్లా కొట్టటం మొదలెట్టాడు
"పరువు"మళ్లీ దెబ్బ,
"పరువు"అంటూ మళ్లీ కొట్టేడు
"పరువేంకావాల్రా నాయాల కనా అంటూ పేద్ద దెబ్బ కొట్టాడు."ఇంకెప్పుడూ చెయ్యను సార్",ఎక్కిళ్లడ్డం పడుతుండగా అన్నాడు."ఇంకో పాలి ఇట్టాంటి యెదవ పన్లు చేఅబ్బులు డాక్టర్ కీ పదమూడు.మొత్తం నలభై మూడు.నిన్నంతా అమ్మితే వచ్చిన కమీషను యాభై.తనకి మిగిలింది ఏ..డు..రూ..పా...య..లు,వాపులూ దెబ్బలూ.శీను ముఖం కందగడ్డలా ఉంది కోపంతో కాదు..బాధతో.మళ్లీ అరచేతులు చూసుకున్నాడు.సన్నటి కర్రపేళ్లు అరచేతులమ్మటా దిగిపోయాయి.వాటికన్నా నేనేం తప్పుచేసానని కొట్టాడు అన్న ఊహ మనస్సులో కలుక్కుమని దిగి బాధపెడుతోంది.నెప్పి వల్లో బాధ వల్లో తెలీదుగానీ కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయిసేవనుకో",మళ్లీ కొట్టబోతుంటే దూరంగా పారిపోయాడు శీను.
"ఇహపో ఎదవా",అన్నాడు డైరెక్టరు.గుమ్మం దాటుతుంటే"ఒరే!ఆఫీసులో ముప్ఫై రూపాయలు ఫైన్ కట్టు ఇన్నావా",
"సరే సార్",అన్నాడు ఏడుపుగొంతుతో.
క్లాసుకెళుతూ ఆలోచించుకుంటున్నాడు.ముప్ఫై ఫైను.టీటీ ఇంజక్షన్ కీ .

ఋణపత్రం

గొంగళీలలో సీతాకోకలు గుర్తించే మానసం
గరిక పక్కన గడ్డిపువ్వును ఆలయాన చేర్చేతనం

గుడిసెల్లోని పసిపిల్లలని మేడల్లోకి
పెంచినా పెంకుటిల్లే తన గర్భాలయమూ వీధిబడే తన గోపురం

కలలు కనడమే తెలిసిన కళ్లకు దారిచూపడమె కర్తవ్యం
ఇన్నినాళ్ల తన అనుభవ సారం పసిపిల్లలకే అంకితం

అతనంటే గడగడలాడింది చిన్ననాడు మన కుర్రతనం
పెద్దెదిగాకా అనిపిస్తుంది గురు పాదోదకం పావనం

చక్రపాకం

సమయం:2సంవత్సరాల క్రితం,
రాత్రి 8:30ప్రదేశం:తాడేపల్లిగూడెంలో ఒకానొక గొందు
సైకిల్ తొక్కుతూ నాలుగైదు కుక్కలు WWF మ్యాచ్ ఆడుకుంటుంటే,ఎందుకొచ్చిన గోలలే అని వేరే సందులోంచి వెళ్తున్నాను.ఎనిమిదిన్నర అయ్యింది ఒక్కసారిగా ఎన్నో గొంతులతో"ఎందుకో నాకు ఈ ఆశలు..."అంటూ ధన్ మని మొదలయ్యాయి.సందులు మారుతున్నా పాట మాత్రం వదలదు.అంటే అన్ని సందుల్లో అన్ని ఇళ్లూ చూస్తున్నా సీరియల్ ఒకటే...........చక్రపాకం
*******
చక్రపాకం సీరియల్ కి ఒక ప్రత్యేకత ఉంది.కథ నాలుగు నెలలకొకసారి కాస్త,మూడు నేలలకోకసారి కూస్త కదులుతుంది.కానీ,ఒక్కరోజు మిస్సయినా ఏదో జరిగిపోతుందేమో అన్న భ్రమలో ఉంచుతుంది మనల్ని.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే .....
*******
సమయం:సంవత్సరం క్రితం(క్రీ.శ .2007),పగలు 12:00 ,
ప్రదేశం: మా ఎదురిల్లు(ఎదుటి వాళ్ల ఇల్లు వెదురు ఇల్లు కాదు).
మా ఎదురింటి వాళ్ల మామ్మ గార్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు.హార్ట్ ప్రాబ్లెం వస్తే ఆపరేషన్ చేయించారు.నీరసం వల్లో ఏమో గాని హాస్పిటల్లో ఆవిడ ఒక్కళ్లతో కూడా మాట్లాడలేదు.ఇప్పుడు చచ్చి బతికిన ఆవిడ మాట్లాడిన మొదటి మాట.
"సుబ్బులూ..!చక్రపాకం ఇక్ఫాల్ బతికే ఉన్నాడా"
ఆవిడనే కాదు ఆ టైం కరెంట్ పొతే కాల్ మూడు రూపాయలు చార్జ్ అయ్యే అప్పట్లోనే ఇరవై ఫోన్లో సోది వేసేది మా అక్క. ఫోన్ చెయ్యగానే అడిగే ప్రశ్న ఒకటే ",పిన్నీ చక్రపాకం ఏమయింది".
వీళ్ళందరి గట్టి నమ్మకం ఏంటంటే చక్రపాకం సీరియల్ ఒక్క రోజు మిస్సయినా కథ ఏదో జరిగిపోతుంది.
*******
నేను కూడా చక్రపాకం సీరియల్ చూసేవాణ్ణి(తొందర పడి బ్లాగ్ చదవటం మానేయ్యకండి చెప్పేది పూర్తిగా వినండి(చదవండి)).కాక పొతే రోజూ కాదు మూడు నెలలకి ఒకసారి.అయినా ఎవరూ చెప్పకుండా కథ అర్ధమైపోయేది.ఎందుకంటే కథ మూణ్ణెల్లకి ఒకసారి కదులుతుంది.నేను చూసినప్పుడు డైలాగుల బట్టి కథ ఏమయ్యిందో అర్ధఅమయ్యేది(కథంటూ ఏమైనా ఉంటే కదా ఏమైనా అవ్వడానికి).
*******
ఇక్కడ మీకో అనుమానం రావాలి అదేంటంటే ఇంతకీ మూణ్ణెల్ల కొకసారి జరిగే కథలో మిగతా ఎపిసోడ్లలో ఏం జరుగుతుంది. దీన్ని మా శివ గాడు ఒక మోడల్ ఎపిసోడ్ తో వివరిస్తాడు.
*******
సమయం:రాత్రి ఎనిమిది గంటల ముప్ఫై మూడు నిమిషాలు,
ప్రదేశం:ఏలూరులో శివ వాళ్ళింట్లో టివి ముందు.
చక్ర పాకంలో ఒక ఎపిసోడ్ మొదలయ్యింది.
ఇర్బాన్ ఫోన్ రింగ్ అవుతోంది.చూస్తే అది హీరోయిన్ నెంబర్(వాళ్ళిద్దరూ స్నేహితులు).ఎత్తుదామనుకుని తనతో నిన్న గొడవ కదా ఎందుకులే అనుకుని ఎత్తడం మానేస్తాడు.హీరోయిన్ సరదాగానే ఫోన్ చేస్తుంది.ఇదంతా చూస్తున్న ఇర్బాన్ భార్య ఫోన్ చేసినమ్మాయి మనకి మంచి ఫ్రెండ్ కదా ఏదో ప్రమాదంలో ఉంది ఫోన్ చేసి ఉంటుంది,తనని అవాయిడ్ చెయ్యొద్దు అని చెప్తుంది.నిజమే ఫూలిష్ గా కట్ చేశాను అంటాడు ఇర్బాన్.హీరోయిన్ ఇర్బాన్ ఏదో డేంజర్ లో ఉన్నాడు అందుకే ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదు అనుకుంటుంది.అక్కడికి బ్రేక్.
బ్రేక్ లో చానల్ మార్చనివ్వరు.ఏమైనా అంటే చక్రపాకంలో యాడ్లు తక్కువ వస్తాయి(భారీ అబద్ధం)అంటారు.
సీరియల్ మళ్ళీ మొదలయ్యాకా ఇర్బాల్ కి ఏమయ్యిందో అని హీరోయిన్ ఇర్బాల్ వాళ్ల అమ్మకి ఫోన్ చేస్తుంది.హీరోయిన్ కి ఏమయ్యిందో అని ఇర్బాల్ హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు.ఇర్బాల్ బానే ఉన్నాడని వాళ్ళమ్మ హీరోయిన్ కి చెప్తుంది.ఇర్బాన్ కి హీరోయిన్ నంబర్ ఎంగేజ్ రావడంతో హీరోయిన్ ఏదో కష్టాల్లో ఉందని ఫిక్స్ అయిపోతాడు.ఒకరికొకరు ఫోన్ చేస్తారు.దాంతో ఎంగేజ్ వస్తుంది.ఇద్దరూ కంగారు పడతారు.ఇర్బాన్ మళ్ళీ ఫోన్ చేస్తాడు ఈసారి కలుస్తుంది.
పాటికి ఎపిసోడ్ అయిపోతుంది.
పైన చెప్పిన ఎపిసోడ్ వల్ల కథ ఏమాత్రమైనా కదులుతుందా?
*******
మామూలుగా చాలా మంది చక్రపాకం అయిపోవస్తుందన్న నమ్మకంతో చూసేవాళ్ళు మొదట్లో ఇక్ఫాల్ (హీరో) చనిపోయాక సీరియల్ అయిపోతుందనుకుని చూడటం మానేసినవాళ్ళు చూడటం మొదలుపెట్టారు(రాత్రి ఎనిమిదిన్నరకి బయటికి వెళ్లవలసి వస్తె జనాలు చక్రపాకం చూస్తున్నారా మానేసారా అన్నది తెలిసేది (పాట అన్ని ఇళ్లల్లోంచి వినిపించడం బట్టి).కాని వాళ్ల పిల్లలతో సీరియల్ కొనసాగించడంతో మతి పోయినత పనైంది.ఇప్పటికన్నా అందరూ సీరియల్ అయ్యింది అంటున్నారు గానీ నాకు అనుమానమే. ఎందుకంటే ఇర్బాల్ కి ఒక పిల్లోడు పుట్టాడు.వాడితో ఏమైనా సీక్వెల్ ప్లాన్ చేసారేమోనని అనుమానం.మనం వద్దనుకుంటే తియ్యడం మానేస్తారా అంజలా నాయుడు గారి దయ బుల్లితెర ప్రాప్తం
*******
వివరణ:పై టపాలోని వ్యక్తులు సంస్థలూ పూర్తిగా నా కల్పితం.నిజజీవితంలోని సంస్థలతో గాని,వ్యక్తులతో గాని పోలిక ఉంటే అదంతా కేవలం యాధౄచ్చికం.
*******
(పై వివరణను నమ్మగలిగిన వారు ఎటువంటి సీరియల్నైనా విచ్చల విడిగా చూడొచ్చు)

బుల్లి తెరాసురుడు

"అరనిమిషం పాటు ఎంతమంది సంఘ విద్రోహ శక్తుల పేర్లు చెప్పగాలవో చెప్పు చూద్దాం"అన్నాడు వంశీ.
మొదలెట్టాను"అంజలా నాయుడు,సింధు నాయుడు,అమన్,సుభాకర్,.................................................................................రోధిక,30సెకన్లు ఐపోయాయి"
వంశీ,"వీళ్లంతా ఎవరు"
"తెలుగు సీరియల్ నటులు,దర్శకులు,నిర్మాతలు,దర్శక నిర్మాతలు,నట గాయక చిత్రకార సంగీత దర్శక దర్శక..."
"ఆపూ..అది తెలుసు.సంఘ విద్రోహ శక్తుల పేర్లడిగితే వీళ్ల పేర్లు చెప్తున్నావేంటీ?"
"వీళ్లు మాత్రం రాత్రనకా పగలనకా డ్రగ్స్ గుడుంబాల కన్నా ప్రమాదకరమైన సీరియల్స్ ని ప్రజలకి అలవాటు చేయడంలేదా?తమ తమ శక్తి మేరకు జనాల మానసిక ఆరోగ్యంతో ఆడుకోవడం లేదా?వీళ్లు మాత్రం సంఘ విద్రోహ శక్తులుకాదా?"
*******
పై విషయం నిజమని నమ్మే వాళ్లతో ప్రాబ్లెం లేదు.నమ్మని వాళ్లు నిజమో కాదో తెలుసుకోమాలని ప్రతి పేరుకొకటి చొప్పునఒక్కో ఎపిసోడ్ చూసే ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటే,తరవాత వాళ్ల ఆరోగ్యంపై నా హామీ ఏదీ లేదు.ఒక్క ఎపిసోడ్కి ఎమవుతుంది లాంటి తిక్కరేగే ప్రశ్నలు వెసే వాళ్లకి ఒక కొటేషన్.
"Any single episode can't change story(story అసలుండదు కనుక)
But,even a single episode can damage (y)our brain(brainఉండే అవకాశం ఉంది కనుక)
*******
సీరియళ్లనే కాదు టీవీ కార్యక్రమాలు కూడా భ్రష్టు పట్టించడంలో మొట్ట మొదటి స్థానం ఎవరిది అనుకోగానే మన మనసుస్క్రీన్ పై "ప్రజంట్ సార్"అని ప్రత్యక్షమయ్యే రూపం అమన్(పేరు మార్చాం).వీక్లీ సీరియల్ గానే "వింతరంగాలు" 5 సెంచరీల ఎపిసోడ్లకి పైగా నడిపించారంటే,జనాల సహనం కన్నా,వాళ్లని అయిదొందల వారాల పాటూ ఎదవల్ని చేసినఅమన్ ప్రతిభని(అమ్మయి పేరు కాదు)మెచ్చుకోవాలి. అమన్ మహాశయులకి ఈమధ్య గొప్ప ఆలోచన వచ్చిది.తీసేవాడికి చూసే వాడు లోకువ కనుక తీసి చూపించారు.పౌరణిక సినిమా(???) ఒకటి తీసి ఏనాడో వెండితెర చేసుకున్నపుణ్యం కొద్దీ, ఎన్ టీఆర్,శోభన్ బాబుల్ని చూసిన పాత్రలో అమన్ ని చూసే (దౌర్)భాగ్యం కోల్పోయింది. సినిమాధియేటర్ల మీదకి వదలకుండా,ఆటీవీ మీదకు "ఉస్కో" అన్నాడు.జనమంతా ర్యాబిస్ ఇంజక్షన్లకి భయపడి ఛానల్మార్చేశారు,అదే సమయానికి నా జాతకంలో శనిగాడు 7 హౌస్ కి అడ్వాన్స్ ఇచ్చి సామాలతో సహా దిగుతునాడు. రోజు మా ఇంట్లో వంశీ కృష్న,రాజేష్,శివ గాడు ఉన్నారు."వంశీ ఆటీవీ పెట్టు"అన్నాను నేను.వాడు ఆటీవీ నెంబర్ ఎంతఅన్న విషయమ్మీద రీసెర్చ్ మొదలుపెట్టాడు."రేయ్ ఛానల్ నెంబర్2" అన్నాను.ఇంతలో మా శివ గాడు(వీడికి జీకేఎక్కువ)"ఏయ్ ఆగు ఇప్పుడు ఆటీవీ అమన్ గాడి సినిమా వేసుకుంటున్నారు.వేరే చానల్ పేట్టమను లేకపోతేకట్టమను",అన్నాడు. నాలో సుభాకర్ నిద్రలేచాడు.లేచి"ఇహహ్హహ్హహ్హా",అని ఇంటికి లాక్ చేసి,ఆటీవీ పెట్టి రిమోట్బీరువాలో దాచి దాన్నీ లాక్ చేసి,తాళాలన్నీ వరండాలో వేసేసా(రెండింటికి మా అమ్మా వాళ్లు వచ్చి తాళాలు తీసిస్తార్లేఅన్న ధైర్యంతో).సినిమా పేరు"శ్రీ రామ లక్ష్మణ యుద్ధం" పేరేంటో మా దరిద్రం."కృష్ణార్జున యుద్ధం" అంటేఒప్పుకున్నాం,"రామాంజనేయ యుద్ధం" అన్నా అర్ధం చేసుకున్నాం(నిజంగా యుద్ధలు జరిగినట్టు పురాణాల్లో లేకపోయినా).కానీ వాల్మీకి కూడా జడుసుకునేలా రామ లక్ష్మణులకి మధ్య యుద్ధమేంటి.ముందుముందు సీతా రామయుద్ధం,రాధా కృష్ణ యుద్ధం(పపం శమించు గాక) తీస్తాడేంటో ఖర్మ(తథాస్తు దేవతలు కంగారు పడి తథాస్తు అంటేసంతోష్ అనే పాపిని అందరూ క్షమించాలి)
సినిమా విషయానికొస్తే అమన్ రాముడి పాత్ర పోషించాడు అనే కంటే,రాముడి పాత్ర అమన్ ని భరించింది అంటే డ్రమటికల్గా కరెక్ట్.రాముడిగా ముఖ కవళికల గురించి వదిలెయ్యండి రాముడు వంగి వంగి నడవడం గూనిగా ఎంటో.ఇంక డైలాగ్డెలివరీ గురించి చెప్పాలంటే అడ్డంగా ఎదిగిన పద్దెనిమిదేళ్ల కుర్రాడు చిన్నపిల్లల్లా ముద్దగా మాట్లాడినట్టు అమన్డైలాగులు చెప్తే ఉందీ...నా సామిరంగా...గ్రౌండ్ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది.అలాంటి సినిమానిగంట భరించే సరికి అందరికి బుర్రలు బ్లాకయి పోయాయి.అప్పటి మా తక్షణ సమస్య దాడినుంచి ఎలాతప్పించుకోవాలి.రాజేష్:ఒరే నీ@@@$$~****$">నీ@@@$$~****$*@@ నీకింత క్రాకేంట్రా నీ@$">నీ@$***@@ వంశీ:రిమోట్ కూడా దాచేసావు కదరా దొంగ నా@$@@@****$@ఇంతలో టీవీ లోంచి అమన్ ముద్దగా:చివరికి న్యాపయ్ గౌరవం కన్న్యా... అంటున్నడువింటుండగానే ఇద్దర్లో రక్తం లావాలా పొంగింది అందుబాటులో ఉన్న సామగ్రితీసుకుని నా మీదకి వస్తున్నారు.రాం గోపాల్ వర్మా సినిమాలో రౌడీల్లా ఒకళ్ళ వంక ఒకళ్లు చూసుకుంటున్నారు.వర్మస్క్రీన్ ప్లే ప్రకారం చూసుకున్నా ఇంకొద్ది క్షణాల్లో నా బుర్ర పగలబోతోంది. నిశ్శబ్దాన్ని ఛేధిస్తూ మా శివ గాడు"ఏరా...టీటీదగ్గర బటన్స్తో ఛనల్ మారుద్దాం" అన్నాడు."అది రిమోట్తో లాక్ చేసుంది"అన్నాను భయంగా.అమన్ గాడుముద్దగా"లక్ష్మణ్ణా ఇకి న్యా ప్రతిఙ్ఞ్య..."అంటున్నాడు.మా వాళ్లిద్దరూ మళ్లీ పొజిషన్స్ తీసుకున్నారు.శివ గాడు"టీవీ ప్లగ్తీసేద్దాం"అని టైంలీగా ప్లగ్,స్విచ్ రెండూ తీసేసాడు.ప్రమాదం తప్పింది చెప్పొచ్చేదేంటంటే పల్నాటిబ్రహ్మనాయుడు,విజయేంద్ర వర్మ,అందరివాడు,జానీ,సుభాష్ చంద్రబోస్ లాంటి కళా ఖండ ఖండాల్ని చివరివరకూచూసిన మా ఓపిక అమన్ ముందు తల వంచింది.
********
బాల అమన్ 6 తరగతి చదువుతుండగా వాళ్ల క్లాస్ టీచర్ అందర్నీ పెద్దయ్యాకా ఏమవుతారు అని అడుగుతోంది.అమన్వంతొచ్చింది.
బాల అమన్:బొమ్మలు వేస్తా,కథా,మాటలు,పాటలు రాస్తా,సంగీత దర్శకత్వం,దర్శకత్వం,.....
.టీచర్:ఆగు బాబు,మీ నాన్నకి బాగా డబ్బుందా
బాల అమన్:ఊఁ
టీచర్:ఉండాలి. బ్రెయిన్తో ఇవన్నీ చెయ్యాలంటే మినిమం వంద కోట్లు ఉండాలి
వెనుక బెంచి బాల మేధావి:జనానికి భరించే ఓపికుండాలి.
******
వివరణ:పై టపాలోని వ్యక్తులు సంస్థలూ పూర్తిగా నా కల్పితం.నిజజీవితంలోని సంస్థలతో గాని,వ్యక్తులతో గాని పోలికఉంటే అదంతా కేవలం యాధౄచ్చికం.
(పై వివరణను నమ్మగలిగిన వారు ఎటువంటి సీరియల్నైనా విచ్చల విడిగా చూడొచ్చు)

మస్కిటో మక్కా

రాత్రి కరెంటు పోయినప్పుడు,
శీతాకాలంలో కూడా ప్రజలు ఆరుబయటకొచ్చి అట్టల్తో,పుస్తకాలతో విసురుకుంటూ,"ఉఫ్,ఉఫ్"మనుకుంటున్నారంటేఅది మద్రాసో,రామగుండమో అయ్యుంటుంది. అదే కొవ్వొత్తులు వెలిగించి చదూకోవడం మొదలుపెట్టారంటే ప్రాంతంహైదరాబాద్ లోని అశోక్ నగర్ (షరా: ప్రాంతంలోంచే భావిIASలు,IASలు అవుతున్నారు).కానీ ఎక్కడైతే ప్రజలు చీకట్లోచెవి దగ్గర దోమల సంగీతం బట్టీ శబ్దభేది ద్వారా చేతుల్తోనో,మస్కిటో బ్యాట్లతోనో( మధ్యన వచ్చాయి లెండి)దోమల్నివేటాడుతూ ఉంటే మాత్రం అది తాడేపల్లిగూడెమే అయ్యుంటుంది(పశ్చిమ గోదావరి జిల్లా,తాడేపల్లిగూడెంమండలం,534101(ఇంకా తాడేపల్లిగూడాలుంటే నాకు సంబంధం లేదు))
*******
స్థల పురాణం ప్రకారం పూర్వం ఒక ఋషి బ్రహ్మ దేవుణ్ణి కోరి ఘోర తపస్సు ప్రారంభించాడు.కొన్నేళ్లకి సినిమాటోమేటిగ్గాప్రపంచమంతా మంటలు రేగాయి,ఓజోన్ పొరకి చిల్లు పడింది,సముద్రంలో భూకంపాలు,భూమ్మీద తుఫాన్లూచెలరేగాయి,గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తో 40-51డిగ్రీల నమోదయ్యాయి.ఇంద్రుడు దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామాచెయ్యాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.దాంతో ఇంద్రుడు సక్సెస్స్ ఫార్ములాను అనుసరించి ఋషి మీదకిరంభ,ఊర్వశి,మేనకల్ని అనే ఐటం డ్యాన్సర్లని వదిలాడు.తనే స్వయంగా రంగంలోకి దిగి పాట మొదలెట్టాడు "అంబరాలచుంబనాల రంభ"మిగతా గ్రూప్ డాన్సర్లు కోరస్ గా "తనన తనన తనన నా""పనసతొనల వయసులలన ఊర్వశి""తననతనన తనన నా""జనక జనక ఎద లోతులో మునక మేనక పూటాపూటా మీతో ఆటా పాటా....."కానీ మిగతా పాటలువినిపించకండా ఋషి జపం వాల్యూం పెంచేసాడు.సరిగ్గా అప్పుడు బృహస్పతి ఇంద్రుడికి చెవిలో ఐడియా చెప్పాడు. ఇంద్రుడు హుషారెత్తిపోయి ఈలేసుకుంటూ ఋషి దగ్గరకొచ్చాడు.ఋషి వెనుకగా వెళ్లి అతని వీపుమీద తట్టాడు(మాదిరిగా కొట్టాడు).ఋషికి అవమానం,తపోభంగం జాయింటుగా జరిగిపోయాయి.ఋషి లేచి "ఓరీ ఇంద్రా..."అని డైలాగ్చెప్పబోతోంటే అపి "తమ వీపుపై దోమవాలింది నేను దానిని కొట్టు ప్రయత్నమున తట్టితిని"అని ఇంద్రుడు బృహస్పతిగారి స్క్రిప్ట్ లోని డైలాగ్ చెప్పాడు.ఋషి దివ్యదృష్టిలో జూం చేసుకుని మరీ తన వీపుపై దోమ లేదని కంఫర్మ్చెసుకున్నాడు.ఇంద్రుడి తప్పుకూ,అతని అబద్ధానికి గాను స్వర్గాన్ని దోమలతో నిండాలని శపిద్దామని,ఒక పద్యంపాడి,నీళ్లు జల్లి,"ఓరీ పాపీ ఇకపై నీ స్వర్గం.."అనబోయి బృహస్పతి పక్కా స్క్రిప్ట్ ప్రకారం సరస్వతీ దేవి వల్ల మాటతడబడడంతో "నా స్వర్గం దోమలతో నిరంతరం నిండియుండు గాక",అనేసాడు.ఎవరి జన్మభూమి వాళ్లకి స్వర్గంకాబట్టి(చూడుడు:జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ) ఋషి జన్మభూమి ఐన తాడేపల్లిగూడానికి శాపమూ,దోమలూ తగులుకున్నాయి.
*******
9th class నుంచీ నేను ఇప్పటి వరకూ చేసిన రీసెర్చి ఫలితాల ముఖ్యాంశాలు ఏంటంటే?
~తాడేపల్లిగూడెం దోమలకు పుణ్యక్షేత్రం,పర్యాటక ప్రాంతం (ఇక్కడ మురిక్కాలవలూ,మురికిగుంటల బీచ్ వంటివిఉన్నాయి)కావడంతో భారీ సంఖ్యలో పక్కూళ్ల నుంచీ,పక్క రాష్ట్రాల నుంచీ దోమలు పర్యటిస్తూ ఉంటాయి.
~పట్టణ పౌరులకి పర్యాటక దోమలకీ,గ్రీన్ కార్డ్ దోమలకీ మధ్య తేడా ఇట్టే తెలిసిపోతుంది.పర్యాటక దోమలు మృదువుగాకుడతాయి,గ్రీన్ కార్డ్ దోమలు చావకుడతాయి(అవి చచ్చే వరకూ కాదు మనం చచ్చేంత దారుణంగా కుడతాయి).
~నదీ పరిసర ప్రాంతాల్లో మానవ నాగరికత అభివృద్ధి చెందినట్టే,మురికిగుంటల పరిసరాల్లో దోమల సంస్కృతివిస్తరిస్తుంది.
~ఇక్కడి దోమలు సాంకేతికంగా మనకన్నా చాలా ముందున్నాయి.మస్కిటో కాయిల్స్,మస్కిటో మ్యాట్లూ,ఒడోమాస్లాంటి చెత్తంతా 2nd generationలో ఉంటే ఇక్కడి దోమలు 4th generationలో ఉన్నాయి.
*******
దోమలు మిగతా సమయాల్లోనూ కుడతాయి గాని సాయంత్రం ఆరు గంటలకు గెరిల్లా తరహా యుద్ధంమొదలుపెడతాయి.కొందరు అమాయకులు పావు తక్కువ ఆరింటికే తలుపులు,కిటికీలు మూసేసి హౌస్ అరెస్ట్అయిపోతారు(సాయంత్రం లక్ష్మీ దేవి వస్తుందని తలుపులు తీస్తే దోమలు వస్తాయని ఇక్కడ సామెత).కానీ దోమలుత్రివిక్రం లా డిఫరెంట్ గా ఆలోచించి లోపల మంచాల కింద రెక్కీ నిర్వహిస్తుంటయి.6:00 అవడం ఆలస్యం సర్ ప్రైస్ అటాక్ఇచ్చి బ్లడ్ శాంపిల్స్ సేకరించడం ప్రారంభిస్తాయి.దోమల్ని కొట్టడం కూడా ఒక ఆర్టు అంటాడు మా శివ గాడు.మనిషినిసెలెక్ట్ చేసుకోవడానికి టైం తీసుకుంటయి గానీ తర్వాత స్టెప్ లో ల్యాండ్ అవ్వడం,స్ట్రా వేసుకుని మన రక్త కోలాతాగడమూ,టేకాఫ్ అవ్వడమూ నానో సెకెన్లలో జరిగిపోతాయి.మన దరిద్రం కొద్దీ అవి టేకాఫ్ అవ్వడం మొదలెట్టాకామనం చెయ్యెత్తుతాం,వెల్లిపోయాకా మనల్ని మనం కొట్టుకుంటాం.ఎన్నో ఏళ్ల నిరంతర కృషీ,చంపితీరాలన్న పట్టుదలఉంటే తప్ప ఇక్కడి దోమల్ని చంపి కక్ష తీర్చుకోలేం.
వ్యవహారం వల్ల ఒకడు హీరో అయిపోతాడు.అతను ప్రతీ మంగళవారం(conditons apply)సాయంత్రం,ప్రతీవీధీ(conditions apply)తిరిగి దోమల్ని చంపే(???)పొగ మిషన్ తో కొడతాడు.మన వీధికి రావాలంటే మాత్రంవార్డుమెంబర్ దగ్గరకెళ్లి వాడితో మనకున్న పరిచయాన్నీ,వాడి మంచితనాన్నీ వివరించి,"వచ్చేసారీ పోటీచెస్తున్నారాండీ" అంటూ మనతో వాడికున్న అవసరాన్ని సూక్ష్మంగా "దోమలూ-కష్టాలూ"అనే విషయంతో రంగరించిచెప్తే,అతను భవిష్యత్తుకీ,మన నోటికీ జడిసి(జడిస్తే) మనముందే మున్సిపల్ ఆఫీసుకి ఫొన్ చేస్తాడు.అదృష్టం బావుంటేసాయంత్రం దోమలపొగ గొట్టం పట్టుకుని ఒకడొస్తాడు. మేటర్లో శనిగాడు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తే చారిత్రాత్మక దినానవాడు లీవ్ పెడతాడు.అదృష్టవశాత్తూ వచ్చినా వాడి సైకిల్ కి అడ్డంగా ఘెరావ్ చేసినా ఐదు సెకొన్లు కూడా ఆగడు(పదిరూపాయలిస్తే ఆగుతాడు).
******
ఇక బురదను వెలికితీసే కార్యక్రమం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది(కానీ నేను ఎక్కువ మాట్లాడానేడిసైడ్ అయ్యాను). పని మున్సిపలిటీ చెయ్యదు .కాంట్రాక్ట్ కి ఇస్తుంది.వచ్చినవాడు అవసరమైతే సంవత్సరం ఊరుకునిసరిగ్గా వర్షాకాలం లోనే పని మోదలెడతాడు.మెయిన్ డ్రైనజీల నుండి బురద తీస్తాడు.పక్కనే వేస్తాడు.కానీ ఎత్తించితీసుకెళ్లడు(నోట్ దిస్ పాయింట్ యువరానర్).వర్షం వస్తుంది,బురద డ్రైన్ లోకి కొట్టుకు పోతుంది(వర్షం రాక పోతే వచ్చేవరకూ బురద అలాగే ఉంచుతాడు)బురద కొట్టుకుపోయిందని మళ్లీ పూడిక తీయాలని సబ్-కాంట్రాక్ట్తీసుకుంటాడు.మళ్లి బురద తీస్తాడు,తీసుకెళ్లడు...షరా మామూలే.వర్షా కాలం ఐపోయాకా గానీ ట్రాక్టర్లలో వేసితీసుకెళ్లడు.డ్రైనేజీ చుట్టూ వెసిన బురద వల్లో ఏంటో దోమలు విపరీతంగా పెరిగిపోతయి.ఇది వర్షాకాలం కధ.చలికాలంఅందరితో పాటే మాకూ దోమలుంటయి.వేసవికాలం సమ్మర్ వెకేషన్ కి ప్రపంచ దేశాలన్నింటిలోంచి దోమలు వస్తాయి.
సో...మాకు సంవత్సరమంతా ఒకటే కాలం పోయే కాలం.