రాత్రి కరెంటు పోయినప్పుడు,
శీతాకాలంలో కూడా ప్రజలు ఆరుబయటకొచ్చి అట్టల్తో,పుస్తకాలతో విసురుకుంటూ,"ఉఫ్,ఉఫ్"మనుకుంటున్నారంటేఅది మద్రాసో,రామగుండమో అయ్యుంటుంది. అదే కొవ్వొత్తులు వెలిగించి చదూకోవడం మొదలుపెట్టారంటే ఆ ప్రాంతంహైదరాబాద్ లోని అశోక్ నగర్ (షరా:ఆ ప్రాంతంలోంచే భావిIASలు,IASలు అవుతున్నారు).కానీ ఎక్కడైతే ప్రజలు చీకట్లోచెవి దగ్గర దోమల సంగీతం బట్టీ శబ్దభేది ద్వారా చేతుల్తోనో,మస్కిటో బ్యాట్లతోనో(ఈ మధ్యన వచ్చాయి లెండి)దోమల్నివేటాడుతూ ఉంటే మాత్రం అది తాడేపల్లిగూడెమే అయ్యుంటుంది(పశ్చిమ గోదావరి జిల్లా,తాడేపల్లిగూడెంమండలం,534101(ఇంకా తాడేపల్లిగూడాలుంటే నాకు సంబంధం లేదు))
*******
స్థల పురాణం ప్రకారం పూర్వం ఒక ఋషి బ్రహ్మ దేవుణ్ణి కోరి ఘోర తపస్సు ప్రారంభించాడు.కొన్నేళ్లకి సినిమాటోమేటిగ్గాప్రపంచమంతా మంటలు రేగాయి,ఓజోన్ పొరకి చిల్లు పడింది,సముద్రంలో భూకంపాలు,భూమ్మీద తుఫాన్లూచెలరేగాయి,గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తో 40-51డిగ్రీల నమోదయ్యాయి.ఇంద్రుడు దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామాచెయ్యాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.దాంతో ఇంద్రుడు సక్సెస్స్ ఫార్ములాను అనుసరించి ఋషి మీదకిరంభ,ఊర్వశి,మేనకల్ని అనే ఐటం డ్యాన్సర్లని వదిలాడు.తనే స్వయంగా రంగంలోకి దిగి పాట మొదలెట్టాడు "అంబరాలచుంబనాల రంభ"మిగతా గ్రూప్ డాన్సర్లు కోరస్ గా "తనన తనన తనన నా""పనసతొనల వయసులలన ఊర్వశి""తననతనన తనన నా""జనక జనక ఎద లోతులో మునక మేనక పూటాపూటా మీతో ఆటా పాటా....."కానీ మిగతా పాటలువినిపించకండా ఋషి జపం వాల్యూం పెంచేసాడు.సరిగ్గా అప్పుడు బృహస్పతి ఇంద్రుడికి చెవిలో ఓ ఐడియా చెప్పాడు. ఇంద్రుడు హుషారెత్తిపోయి ఈలేసుకుంటూ ఋషి దగ్గరకొచ్చాడు.ఋషి వెనుకగా వెళ్లి అతని వీపుమీద తట్టాడు(ఓమాదిరిగా కొట్టాడు).ఋషికి అవమానం,తపోభంగం జాయింటుగా జరిగిపోయాయి.ఋషి లేచి "ఓరీ ఇంద్రా..."అని డైలాగ్చెప్పబోతోంటే అపి "తమ వీపుపై దోమవాలింది నేను దానిని కొట్టు ప్రయత్నమున తట్టితిని"అని ఇంద్రుడు బృహస్పతిగారి స్క్రిప్ట్ లోని డైలాగ్ చెప్పాడు.ఋషి దివ్యదృష్టిలో జూం చేసుకుని మరీ తన వీపుపై దోమ లేదని కంఫర్మ్చెసుకున్నాడు.ఇంద్రుడి తప్పుకూ,అతని అబద్ధానికి గాను స్వర్గాన్ని దోమలతో నిండాలని శపిద్దామని,ఒక పద్యంపాడి,నీళ్లు జల్లి,"ఓరీ పాపీ ఇకపై నీ స్వర్గం.."అనబోయి బృహస్పతి పక్కా స్క్రిప్ట్ ప్రకారం సరస్వతీ దేవి వల్ల మాటతడబడడంతో "నా స్వర్గం దోమలతో నిరంతరం నిండియుండు గాక",అనేసాడు.ఎవరి జన్మభూమి వాళ్లకి స్వర్గంకాబట్టి(చూడుడు:జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ)ఆ ఋషి జన్మభూమి ఐన తాడేపల్లిగూడానికి ఆశాపమూ,దోమలూ తగులుకున్నాయి.
*******
9th class నుంచీ నేను ఇప్పటి వరకూ చేసిన రీసెర్చి ఫలితాల ముఖ్యాంశాలు ఏంటంటే?
~తాడేపల్లిగూడెం దోమలకు పుణ్యక్షేత్రం,పర్యాటక ప్రాంతం (ఇక్కడ మురిక్కాలవలూ,మురికిగుంటల బీచ్ వంటివిఉన్నాయి)కావడంతో భారీ సంఖ్యలో పక్కూళ్ల నుంచీ,పక్క రాష్ట్రాల నుంచీ దోమలు పర్యటిస్తూ ఉంటాయి.
~పట్టణ పౌరులకి పర్యాటక దోమలకీ,గ్రీన్ కార్డ్ దోమలకీ మధ్య తేడా ఇట్టే తెలిసిపోతుంది.పర్యాటక దోమలు మృదువుగాకుడతాయి,గ్రీన్ కార్డ్ దోమలు చావకుడతాయి(అవి చచ్చే వరకూ కాదు మనం చచ్చేంత దారుణంగా కుడతాయి).
~నదీ పరిసర ప్రాంతాల్లో మానవ నాగరికత అభివృద్ధి చెందినట్టే,మురికిగుంటల పరిసరాల్లో దోమల సంస్కృతివిస్తరిస్తుంది.
~ఇక్కడి దోమలు సాంకేతికంగా మనకన్నా చాలా ముందున్నాయి.మస్కిటో కాయిల్స్,మస్కిటో మ్యాట్లూ,ఒడోమాస్లాంటి చెత్తంతా 2nd generationలో ఉంటే ఇక్కడి దోమలు 4th generationలో ఉన్నాయి.
*******
దోమలు మిగతా సమయాల్లోనూ కుడతాయి గాని సాయంత్రం ఆరు గంటలకు గెరిల్లా తరహా యుద్ధంమొదలుపెడతాయి.కొందరు అమాయకులు పావు తక్కువ ఆరింటికే తలుపులు,కిటికీలు మూసేసి హౌస్ అరెస్ట్అయిపోతారు(సాయంత్రం లక్ష్మీ దేవి వస్తుందని తలుపులు తీస్తే దోమలు వస్తాయని ఇక్కడ సామెత).కానీ దోమలుత్రివిక్రం లా డిఫరెంట్ గా ఆలోచించి లోపల మంచాల కింద రెక్కీ నిర్వహిస్తుంటయి.6:00 అవడం ఆలస్యం సర్ ప్రైస్ అటాక్ఇచ్చి బ్లడ్ శాంపిల్స్ సేకరించడం ప్రారంభిస్తాయి.దోమల్ని కొట్టడం కూడా ఒక ఆర్టు అంటాడు మా శివ గాడు.మనిషినిసెలెక్ట్ చేసుకోవడానికి టైం తీసుకుంటయి గానీ తర్వాత స్టెప్ లో ల్యాండ్ అవ్వడం,స్ట్రా వేసుకుని మన రక్త కోలాతాగడమూ,టేకాఫ్ అవ్వడమూ నానో సెకెన్లలో జరిగిపోతాయి.మన దరిద్రం కొద్దీ అవి టేకాఫ్ అవ్వడం మొదలెట్టాకామనం చెయ్యెత్తుతాం,వెల్లిపోయాకా మనల్ని మనం కొట్టుకుంటాం.ఎన్నో ఏళ్ల నిరంతర కృషీ,చంపితీరాలన్న పట్టుదలఉంటే తప్ప ఇక్కడి దోమల్ని చంపి కక్ష తీర్చుకోలేం.
ఈ వ్యవహారం వల్ల ఒకడు హీరో అయిపోతాడు.అతను ప్రతీ మంగళవారం(conditons apply)సాయంత్రం,ప్రతీవీధీ(conditions apply)తిరిగి దోమల్ని చంపే(???)పొగ ఓ మిషన్ తో కొడతాడు.మన వీధికి రావాలంటే మాత్రంవార్డుమెంబర్ దగ్గరకెళ్లి వాడితో మనకున్న పరిచయాన్నీ,వాడి మంచితనాన్నీ వివరించి,"వచ్చేసారీ పోటీచెస్తున్నారాండీ" అంటూ మనతో వాడికున్న అవసరాన్ని సూక్ష్మంగా "దోమలూ-కష్టాలూ"అనే విషయంతో రంగరించిచెప్తే,అతను భవిష్యత్తుకీ,మన నోటికీ జడిసి(జడిస్తే) మనముందే మున్సిపల్ ఆఫీసుకి ఫొన్ చేస్తాడు.అదృష్టం బావుంటేసాయంత్రం దోమలపొగ గొట్టం పట్టుకుని ఒకడొస్తాడు.ఈ మేటర్లో శనిగాడు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తే ఆ చారిత్రాత్మక దినానవాడు లీవ్ పెడతాడు.అదృష్టవశాత్తూ వచ్చినా వాడి సైకిల్ కి అడ్డంగా ఘెరావ్ చేసినా ఐదు సెకొన్లు కూడా ఆగడు(పదిరూపాయలిస్తే ఆగుతాడు).
******
ఇక బురదను వెలికితీసే కార్యక్రమం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది(కానీ నేను ఎక్కువ మాట్లాడానేడిసైడ్ అయ్యాను).ఆ పని మున్సిపలిటీ చెయ్యదు .కాంట్రాక్ట్ కి ఇస్తుంది.వచ్చినవాడు అవసరమైతే సంవత్సరం ఊరుకునిసరిగ్గా వర్షాకాలం లోనే పని మోదలెడతాడు.మెయిన్ డ్రైనజీల నుండి బురద తీస్తాడు.పక్కనే వేస్తాడు.కానీ ఎత్తించితీసుకెళ్లడు(నోట్ దిస్ పాయింట్ యువరానర్).వర్షం వస్తుంది,బురద డ్రైన్ లోకి కొట్టుకు పోతుంది(వర్షం రాక పోతే వచ్చేవరకూ బురద అలాగే ఉంచుతాడు)బురద కొట్టుకుపోయిందని మళ్లీ పూడిక తీయాలని సబ్-కాంట్రాక్ట్తీసుకుంటాడు.మళ్లి బురద తీస్తాడు,తీసుకెళ్లడు...షరా మామూలే.వర్షా కాలం ఐపోయాకా గానీ ట్రాక్టర్లలో వేసితీసుకెళ్లడు.డ్రైనేజీ చుట్టూ వెసిన బురద వల్లో ఏంటో దోమలు విపరీతంగా పెరిగిపోతయి.ఇది వర్షాకాలం కధ.చలికాలంఅందరితో పాటే మాకూ దోమలుంటయి.వేసవికాలం సమ్మర్ వెకేషన్ కి ప్రపంచ దేశాలన్నింటిలోంచి దోమలు వస్తాయి.
సో...మాకు సంవత్సరమంతా ఒకటే కాలం పోయే కాలం.

చాల బాగా రాసారు పక్కింటి అబ్బాయి గారు. ఈ మధ్య ఈ దోమల పర్యాటక రంగం విజ్రుభించింది. మా ఊర్లో (హైదరాబాద్) ప్రత్యేక స్టార్ హోటళ్లు వెలుస్తున్నాయి. త్వరలోనే మీ ఊరి దోమల వ్యాపారాన్నంతా (పర్యాటక దోమల్ని..) ఆకర్షించడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు ఇంక గ్రీన్ కార్డ్ దోమలే మిగుల్తాయేమో.. మా ఊర్లో frequent flyer దోమలకు రెడ్ కార్డ్ ఇచ్చే స్కీమ్ కూడా ఉంది. దోమ కుడితే సంభవించే మరణాలకు ఇన్సురన్స్ ఇవ్వటానికి ఆలోచనలు జరుగుతున్నాయి.
అమ్మో అదరగొట్టేశారు.
మీ ఎప్పుడన్న దొమల డెవలప్ మెంట్ సెంటర్ పెట్టాలంటే ఐక్య రాజ్యసమితికి మీ ఊరి పేరు రెకమండ్ చేస్తా. ప్రత్యేక్ సెజ్ లొస్తున్నాయని భూములేమన్నా వుంటే ఇప్పుడే అమ్మేసుకోండి.
-- విహారి
కామెడీతో కేక పెట్టించారండి.ఇలాగే పదికాలాలు దోమలు కొట్టుకుంటూ,మమ్మల్ని నవ్విస్తూ ఉండమని కోరుతున్నాము.
తాడేపల్లి గూడెమేనా, భీమవరం గురించి రాయలేదేమి? అక్కడ మాత్రం తక్కువనా? దోమలు 'ఇందుగలవందులేవని సందేహము వలదు ' టైపులూ ఎందెందు వెదకి చూడాలే గానీ, మస్కిటో మాట్లు, బాట్లూ వగైరాల నుంచి ఇమ్యూనైజ్ అయిపోయి ఉన్నాయండి !అశోక్ నగర్ గురించి రాసింది చదువుతుంటే బాగా నవ్వొచ్చింది.విహారి గారికి మంచి పోటీ దొరికినట్టే అనిపిస్తోంది.
భేష్,రమణ ని జంధ్యాలని తలపించారు. మీ దోమల భాగోతం ఆంధ్ర దేశం లోని ప్రతి పల్లెకూ,పట్నానికీ చెల్లుతుంది (ఇందులో మీ ప్రమేయం లేదని నమ్ముతున్నాను).ఇంత యూనివర్సల్ సబ్జెక్ట్ ని కేక పెట్టించిన మీ శైలి ముదావహం.
మంచి హాస్యాన్ని అందించారు. ఇలానే కంటిన్యూ అవండి.
కామెంట్సుకి word verification అవసరమంటారా?. ఒక్కొకసారి ఈ word verification ఇబ్బంది పెడుతుంటుంది, ఇక కామెంట్సు రాయలనిపించదు.
:))) మొత్తానికి మీ ఊరు మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నమాట!
నిజంగానే దోమల్ని కొట్టడం ఒక కళే! ఫట్ మని కొట్టిన ఆ దెబ్బకి మన శరీరం కందిపోయినా ఆ దోమ చస్తే మాత్రం ఆ విజయగర్వాన్ని మాటల్లో వర్ణించలేం!
నిషిగంధ గారు,
భలే చెప్పారు సుమా! శత్రువుని జయించిన ఫీలింగ్ కదా!
సుజాత గారు,విహారి గారు,నిషిగంధ గారు,రాధిక గారు,మహేష్ కుమార్ గారు,సిరిసిరిమువ్వ గారు అందరికీ నా కృతఙ్ఞతలు.కానీ మహేష్ కుమార్ గారు అన్నట్టు ముళ్లపూడి,జంధ్యాలల స్థాయి,శైలి అందుకున్నానని అంటే ఒప్పుకోలేకపోతున్నాను(అంత సీన్ ఎక్కడిదండీ మనకు(మనకు=నాకు).మొత్తానికి ఆ కామెంట్ చదివాకా అలా ఒక్కసారి మేఘాల్లోకి వెళ్లి మేఘాలలో తేలిపోతున్నది అని ఓ పాటేసుకున్నా.కానీ పాట అవుతుండగానే ముత్యాల ముగ్గులోలా మనసులో బాజాలు మోగాయి.అయ్ బాబోయ్ ఆయన ఏదో సరదాగా మేచ్చుకుంటే రాజకీయనాయకుల్లా అలా ఈ తేలిపోవడమేంటీ అనిపించింది.దాంతో నేలమీదకు దిగివచ్చా.
--సంతోష్ సూరంపూడి
మీరు ఒప్పు కున్నా కోకపోయినా ముళ్లపూడి, జంధ్యాలల స్థాయిలోనే వుంది ఈ దోమల ప్రహసనం. సినిమాటోమాటిగ్గా వంటి కొన్ని పదాలు కూడా పడ్డాయికదా! స్థలపురాణం కమనీయంగా వుంది. హైదరాబాదులో 'దోమల్ గూడా' అనే ప్రాతమొకటివుంది కదా, దాని స్థలపురాణం కూడా ఎవరైనా చెబితే వినాలి. గతంలో పానుగంటివారనుకుంటాను ఇలాంటిదే ఒకటి రాశారట. అందులో మశక మత్కుణ మూషికాదులన్నీ సమావేశమై మానవజన్మ ఏయే విధాలుగా తమజన్మలకంటే నీచమైనదో ఉపన్యాసాలిస్తాయట. ఈ ప్రహసనాన్ని దొరకబుచ్చుకొని చదవాలి.
కావాలంటే కామెంట్ మోడరేషన్ పెట్టుకోండి కానీ వర్డ్ వెరిఫికేషన్ తీసేసి మా పని సలువుచెయ్యమని విన్నపం.
మీ మస్కిటోపాఖ్యానం అదిరిందండీ!
మీరు చెప్పిన కథలో కించిత్తు వాస్తవం లేకపోలేదనిపిస్తోంది. ఎందుకంటే అసలు దోమలకి మన భారతదేశమే పుట్టిల్లు. వీటినిక్కడ చూసిన పాశ్చాత్యులు, వీటినేవంటారని మనవాళ్ళనడిగితే, అప్పటి మన భాషలో మనవాళ్ళు "మశకం" అని చెప్పారు. వాళ్ళకి నోరుతిరక్క దాన్ని ఏవిటో, మసకిటో అని అనుకున్నారు. అదే మరి మస్కిటో గా మారింది!
వాటికి మనకన్నా దేశభక్తి మెండు. అందుకే మనలా వీసాలుచ్చుకొని అమెరికాకి ఎగిరిపోకుండా, "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అని ఇక్కడే తరతరాలుగా జీవనాన్ని సాగిస్తున్నాయి, మన మీద ఇంతటి సోదరప్రేమ కురిపిస్తూ!
కాబట్టి ఏతావాతా తేలేదేవిటయ్యా అంటే,
ఇందుగల దందులేదను
సందేహము వలదు, దోమ సర్వోపగతం
బెందెందు సందుదొరకిన
అందందే కలదు భారతావని గంటే!
అధ్యక్షా... దోమల జన్మభూమి తాడేపల్లిగూడెం అనే ఆరోపణని నేను తీవ్రంగా ఖండిస్తున్నూ ఇంకా సదరు జన్మభూమి కాకినాడ అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను
చాల బాగా చెప్పారు పక్కింటి అబ్బాయి గారు. మాది తాడేపల్లి గూడెమే నండీ. కానీ (సాయిరామ్మాష్తారు , శారదా కాన్వెంటు, 1990)మా నాన్నారు మమ్మల్ని వదలి వెళ్ళాక మరి తిరిగి చూదలేదిప్పటి వరకూ.