గొంగళీలలో సీతాకోకలు గుర్తించే మానసం
గరిక పక్కన గడ్డిపువ్వును ఆలయాన చేర్చేతనం
గుడిసెల్లోని పసిపిల్లలని మేడల్లోకి
పెంచినా పెంకుటిల్లే తన గర్భాలయమూ వీధిబడే తన గోపురం
కలలు కనడమే తెలిసిన కళ్లకు దారిచూపడమె కర్తవ్యం
ఇన్నినాళ్ల తన అనుభవ సారం పసిపిల్లలకే అంకితం
అతనంటే గడగడలాడింది చిన్ననాడు మన కుర్రతనం
పెద్దెదిగాకా అనిపిస్తుంది గురు పాదోదకం పావనం

మంచి గురువుకు అర్ధం లా వుంది మీ కవిత.మీరు నవ్వించడమేకాదు,సీరియస్ గా కూడా రాస్తారని ఇప్పుడే తెలిసింది.చాలా బాగా రాసారు.
ఆలస్యంగా కృతఙ్ఞతలు చెప్తున్నందుకు క్షమాపణలతో కృతఙ్ఞతలు.
--సంతోష్ సూరంపూడి