Your Ad Here

బుల్లి తెరాసురుడు

"అరనిమిషం పాటు ఎంతమంది సంఘ విద్రోహ శక్తుల పేర్లు చెప్పగాలవో చెప్పు చూద్దాం"అన్నాడు వంశీ.
మొదలెట్టాను"అంజలా నాయుడు,సింధు నాయుడు,అమన్,సుభాకర్,.................................................................................రోధిక,30సెకన్లు ఐపోయాయి"
వంశీ,"వీళ్లంతా ఎవరు"
"తెలుగు సీరియల్ నటులు,దర్శకులు,నిర్మాతలు,దర్శక నిర్మాతలు,నట గాయక చిత్రకార సంగీత దర్శక దర్శక..."
"ఆపూ..అది తెలుసు.సంఘ విద్రోహ శక్తుల పేర్లడిగితే వీళ్ల పేర్లు చెప్తున్నావేంటీ?"
"వీళ్లు మాత్రం రాత్రనకా పగలనకా డ్రగ్స్ గుడుంబాల కన్నా ప్రమాదకరమైన సీరియల్స్ ని ప్రజలకి అలవాటు చేయడంలేదా?తమ తమ శక్తి మేరకు జనాల మానసిక ఆరోగ్యంతో ఆడుకోవడం లేదా?వీళ్లు మాత్రం సంఘ విద్రోహ శక్తులుకాదా?"
*******
పై విషయం నిజమని నమ్మే వాళ్లతో ప్రాబ్లెం లేదు.నమ్మని వాళ్లు నిజమో కాదో తెలుసుకోమాలని ప్రతి పేరుకొకటి చొప్పునఒక్కో ఎపిసోడ్ చూసే ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటే,తరవాత వాళ్ల ఆరోగ్యంపై నా హామీ ఏదీ లేదు.ఒక్క ఎపిసోడ్కి ఎమవుతుంది లాంటి తిక్కరేగే ప్రశ్నలు వెసే వాళ్లకి ఒక కొటేషన్.
"Any single episode can't change story(story అసలుండదు కనుక)
But,even a single episode can damage (y)our brain(brainఉండే అవకాశం ఉంది కనుక)
*******
సీరియళ్లనే కాదు టీవీ కార్యక్రమాలు కూడా భ్రష్టు పట్టించడంలో మొట్ట మొదటి స్థానం ఎవరిది అనుకోగానే మన మనసుస్క్రీన్ పై "ప్రజంట్ సార్"అని ప్రత్యక్షమయ్యే రూపం అమన్(పేరు మార్చాం).వీక్లీ సీరియల్ గానే "వింతరంగాలు" 5 సెంచరీల ఎపిసోడ్లకి పైగా నడిపించారంటే,జనాల సహనం కన్నా,వాళ్లని అయిదొందల వారాల పాటూ ఎదవల్ని చేసినఅమన్ ప్రతిభని(అమ్మయి పేరు కాదు)మెచ్చుకోవాలి. అమన్ మహాశయులకి ఈమధ్య గొప్ప ఆలోచన వచ్చిది.తీసేవాడికి చూసే వాడు లోకువ కనుక తీసి చూపించారు.పౌరణిక సినిమా(???) ఒకటి తీసి ఏనాడో వెండితెర చేసుకున్నపుణ్యం కొద్దీ, ఎన్ టీఆర్,శోభన్ బాబుల్ని చూసిన పాత్రలో అమన్ ని చూసే (దౌర్)భాగ్యం కోల్పోయింది. సినిమాధియేటర్ల మీదకి వదలకుండా,ఆటీవీ మీదకు "ఉస్కో" అన్నాడు.జనమంతా ర్యాబిస్ ఇంజక్షన్లకి భయపడి ఛానల్మార్చేశారు,అదే సమయానికి నా జాతకంలో శనిగాడు 7 హౌస్ కి అడ్వాన్స్ ఇచ్చి సామాలతో సహా దిగుతునాడు. రోజు మా ఇంట్లో వంశీ కృష్న,రాజేష్,శివ గాడు ఉన్నారు."వంశీ ఆటీవీ పెట్టు"అన్నాను నేను.వాడు ఆటీవీ నెంబర్ ఎంతఅన్న విషయమ్మీద రీసెర్చ్ మొదలుపెట్టాడు."రేయ్ ఛానల్ నెంబర్2" అన్నాను.ఇంతలో మా శివ గాడు(వీడికి జీకేఎక్కువ)"ఏయ్ ఆగు ఇప్పుడు ఆటీవీ అమన్ గాడి సినిమా వేసుకుంటున్నారు.వేరే చానల్ పేట్టమను లేకపోతేకట్టమను",అన్నాడు. నాలో సుభాకర్ నిద్రలేచాడు.లేచి"ఇహహ్హహ్హహ్హా",అని ఇంటికి లాక్ చేసి,ఆటీవీ పెట్టి రిమోట్బీరువాలో దాచి దాన్నీ లాక్ చేసి,తాళాలన్నీ వరండాలో వేసేసా(రెండింటికి మా అమ్మా వాళ్లు వచ్చి తాళాలు తీసిస్తార్లేఅన్న ధైర్యంతో).సినిమా పేరు"శ్రీ రామ లక్ష్మణ యుద్ధం" పేరేంటో మా దరిద్రం."కృష్ణార్జున యుద్ధం" అంటేఒప్పుకున్నాం,"రామాంజనేయ యుద్ధం" అన్నా అర్ధం చేసుకున్నాం(నిజంగా యుద్ధలు జరిగినట్టు పురాణాల్లో లేకపోయినా).కానీ వాల్మీకి కూడా జడుసుకునేలా రామ లక్ష్మణులకి మధ్య యుద్ధమేంటి.ముందుముందు సీతా రామయుద్ధం,రాధా కృష్ణ యుద్ధం(పపం శమించు గాక) తీస్తాడేంటో ఖర్మ(తథాస్తు దేవతలు కంగారు పడి తథాస్తు అంటేసంతోష్ అనే పాపిని అందరూ క్షమించాలి)
సినిమా విషయానికొస్తే అమన్ రాముడి పాత్ర పోషించాడు అనే కంటే,రాముడి పాత్ర అమన్ ని భరించింది అంటే డ్రమటికల్గా కరెక్ట్.రాముడిగా ముఖ కవళికల గురించి వదిలెయ్యండి రాముడు వంగి వంగి నడవడం గూనిగా ఎంటో.ఇంక డైలాగ్డెలివరీ గురించి చెప్పాలంటే అడ్డంగా ఎదిగిన పద్దెనిమిదేళ్ల కుర్రాడు చిన్నపిల్లల్లా ముద్దగా మాట్లాడినట్టు అమన్డైలాగులు చెప్తే ఉందీ...నా సామిరంగా...గ్రౌండ్ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది.అలాంటి సినిమానిగంట భరించే సరికి అందరికి బుర్రలు బ్లాకయి పోయాయి.అప్పటి మా తక్షణ సమస్య దాడినుంచి ఎలాతప్పించుకోవాలి.రాజేష్:ఒరే నీ@@@$$~****$">నీ@@@$$~****$*@@ నీకింత క్రాకేంట్రా నీ@$">నీ@$***@@ వంశీ:రిమోట్ కూడా దాచేసావు కదరా దొంగ నా@$@@@****$@ఇంతలో టీవీ లోంచి అమన్ ముద్దగా:చివరికి న్యాపయ్ గౌరవం కన్న్యా... అంటున్నడువింటుండగానే ఇద్దర్లో రక్తం లావాలా పొంగింది అందుబాటులో ఉన్న సామగ్రితీసుకుని నా మీదకి వస్తున్నారు.రాం గోపాల్ వర్మా సినిమాలో రౌడీల్లా ఒకళ్ళ వంక ఒకళ్లు చూసుకుంటున్నారు.వర్మస్క్రీన్ ప్లే ప్రకారం చూసుకున్నా ఇంకొద్ది క్షణాల్లో నా బుర్ర పగలబోతోంది. నిశ్శబ్దాన్ని ఛేధిస్తూ మా శివ గాడు"ఏరా...టీటీదగ్గర బటన్స్తో ఛనల్ మారుద్దాం" అన్నాడు."అది రిమోట్తో లాక్ చేసుంది"అన్నాను భయంగా.అమన్ గాడుముద్దగా"లక్ష్మణ్ణా ఇకి న్యా ప్రతిఙ్ఞ్య..."అంటున్నాడు.మా వాళ్లిద్దరూ మళ్లీ పొజిషన్స్ తీసుకున్నారు.శివ గాడు"టీవీ ప్లగ్తీసేద్దాం"అని టైంలీగా ప్లగ్,స్విచ్ రెండూ తీసేసాడు.ప్రమాదం తప్పింది చెప్పొచ్చేదేంటంటే పల్నాటిబ్రహ్మనాయుడు,విజయేంద్ర వర్మ,అందరివాడు,జానీ,సుభాష్ చంద్రబోస్ లాంటి కళా ఖండ ఖండాల్ని చివరివరకూచూసిన మా ఓపిక అమన్ ముందు తల వంచింది.
********
బాల అమన్ 6 తరగతి చదువుతుండగా వాళ్ల క్లాస్ టీచర్ అందర్నీ పెద్దయ్యాకా ఏమవుతారు అని అడుగుతోంది.అమన్వంతొచ్చింది.
బాల అమన్:బొమ్మలు వేస్తా,కథా,మాటలు,పాటలు రాస్తా,సంగీత దర్శకత్వం,దర్శకత్వం,.....
.టీచర్:ఆగు బాబు,మీ నాన్నకి బాగా డబ్బుందా
బాల అమన్:ఊఁ
టీచర్:ఉండాలి. బ్రెయిన్తో ఇవన్నీ చెయ్యాలంటే మినిమం వంద కోట్లు ఉండాలి
వెనుక బెంచి బాల మేధావి:జనానికి భరించే ఓపికుండాలి.
******
వివరణ:పై టపాలోని వ్యక్తులు సంస్థలూ పూర్తిగా నా కల్పితం.నిజజీవితంలోని సంస్థలతో గాని,వ్యక్తులతో గాని పోలికఉంటే అదంతా కేవలం యాధౄచ్చికం.
(పై వివరణను నమ్మగలిగిన వారు ఎటువంటి సీరియల్నైనా విచ్చల విడిగా చూడొచ్చు)
12 Responses
  1. malli aa terasurudu kotta movie tho dandettapotunnadani adds vastunnayi.chudaledaa?


  2. Anonymous Says:

    నిజం చెప్పండి. మీరు మారు వేషం లో వున్న మా "తెలుగు కామెడీ టెర్రరిస్టుల సంఘం" లోన్ని సభ్యులే కదా.

    ఈ సభ్యులు స్లీపర్ సెల్స్ లాగా విడిపోయి హాస్య విస్పోటకం సృష్టిస్తుంటారు. మీరు పాత బ్లాగరని నాకు గాఠ్ఠి నమ్మకం.

    -- విహారి


  3. పక్కింటబ్బయ్ గారూ, మహబాగా పండించారు ‘టీవీ’ ని.
    మీ అమన్ గారు, ఒకసారి ఓ చిన్న ప్రొడ్యూసరు ఆరు ఎపిసోడ్ల పైలట్(దాదాపు మూడు లక్షల ఖర్చు)చేసుకొస్తే, హీరోయిన్కి రెండు జెడలువేసి మళ్ళీ షూట్ చెసి తీసుకురమ్మనాడట.సాడిజానికి సాక్ష్యమిది. ఇక వాడుమనల్ని పెట్టదల్చుకున్న బాధకి "ఆ టీవీ" ఏ సాక్ష్యం.


  4. సంతోష్,
    'అమన్ ' పౌరాణికం భరించాక పల్నాటి బ్రహ్మ నాయుడు బలే ఆహ్లాదంగా ఉంటుంది కదా! ముఖ్యంగా అమన్ గారి ముద్ద డైలాగులు అద్భుతంగా రాశారు.

    "రాముడి పాత్ర అమన్ ని భరించింది" అదిరింది.
    నిజంగానే అమన్ సుభాకర్ సాయంతో సీతారమ యుద్ధం, రాధాక్రిష్ణ యుద్ధం తీయగల సమర్థుడే!

    విహారి గారు, ఇదిగో మీకిక్కడ గొప్ప కాంపిటీషను!


  5. విహారి గారూ నా పేరు సంతోష్,బీ.ఫార్మసీ చదువుతున్నాను.ఆంధ్రజ్యోతిలోని ఆర్టికల్(మనవాళ్లంతా బ్లాగుడు కాయలే,ఆదివారం ఆంధ్రజ్యోతి)చదివే బ్లాగ్ గురించి తెలుసుకున్నాను.నేను బ్లాగ్ చూడడం మొదలు పెట్టినప్పటి నుంచీ తోటరాముడు(గౌతం)కి,మీకు వీరాభిమానినయ్యాను.ఇదే నా మొదటి బ్లాగ్.
    -సంతోష్ సూరంపూడి.


  6. ఇన్ని ముద్రా రాక్షసాలున్నా నా టపాను అభినందించినందుకు మీ అందరికీ కృతఙ్ఞతలు.
    మా ఊరి మున్సిపాలిటీ నుంచి ఆటీవీ అమన్ వరకు ఇందరి తప్పులెన్నిన వాణ్ణి నా తప్పులు 24గంటలు ఆలశ్యంగా తెలుసుకున్నా.
    --సంతోష్ సూరంపూడి.


  7. అదిరింది టపా... ఎవరిని ఉద్దేశించి రాయలేదు అని ప్రకటించారు. అంత అవసరం లేదు. ఒక వేళ ఉద్దేశించి రాసినా ... ఎవరు ఏమి పీకలేరు... దంచేయ్యండి..


  8. RG Says:

    Iragadeesaav basu... I don't think you've to change names BTW :)


  9. Unknown Says:

    అమన్ గారికి కూడా ఫాన్స్ ఉన్నారండీ. మా పక్కింటి ఆంటి ఆయన సీరియల్స్‌ని వదలకుండా చూస్తుంది.


  10. Anonymous Says:

    a nice blog full of comedy matcing with vihari and renurellu aaru


  11. నవ్వలేక చచ్చానండి. సుపరండి. so nice. marvelous. తరచూ మా పక్కింటో వినిపిద్దురూ .


  12. srini Says:

    superb sir
    thanks after a long time i laughed like anything.
    thanks