Your Ad Here

పూలూ-పడగలు

తెల్లవారుజాము మూడున్నరైంది టైము.ఆ రోజు సుబ్రహ్మణ్య షష్టి.మా అత్తిల్లో సుబ్బారాయుడి గుడి కళకళ్లాడి పోతోంది. గుళ్లో గంటలు ఠంగు ఠంగున మోగుతున్నాయి.ఓ పక్క ఠపేల్ ఠపేల్మని కొబ్బరికాయలు పగిలిపోతున్నయి.పూజారులు వేదమంత్రోఛ్ఛారణలుఒ,మైకులో,"అమ్మా!లైన్నించి జరక్కండి.ఏం బాబూ ఎర్రచొక్కా తోస్తావేం.అందరూ ఐదు నిముషాలు అటూ ఇటులో దర్శనం చేసేసుకుంటాం....."అంటూ సూచనలు.ఇన్ని శబ్దాల నగిషీల మధ్య"పూలూ పడగలూ పూలూ పడగలూ ఒక్క రూపాయికి రెండు"అంటూ ఓ గొంతు తళుక్కుమంటోంది.ధర్మదర్శనం లైన్లో ఆచివర్నించి ఈ చివరివొరుకూ కలతిరిగేస్తూ అమ్ముతున్నాడు.ఆ పువ్వు మీంచి ఈ పువ్వు మీదకు వాలే తూనీగల్లా పూలూ పడగలమ్ముకునే పిల్లలు తిరుగుతూ అమ్ముకుంటున్నారు.అందరూ దాదాపు పది నించి పదమూడేళ్ల వయసుల వాళ్లే.కొందరు పిల్లలు "నేనడిగిన వాళ్లకు నన్నుతప్పించి అమ్మేసావ్",అంటూ ఒహళ్లనొహళ్లు తిట్టుకుంటున్నరు.కానీ అందర్లోకీ కలివిడిగా తిరుగుతూ అమ్ముతున్నాడో కుర్రాడు శీను గాడు.
"తెల్లారితే ఎండ ముదిరిపోద్ద"ని కొందరు,"చుట్టు పక్కల ఊళ్ళ వాళ్లు వచ్చే టయానికి వెళ్తే లైను పొడుగైపోతుంద,"ని కొందరు,పిల్లలు టిఫెన్లకాగలేరని కొందరూ తెల్లారుఝాము ఐదులోపే దర్శనానికొచ్చేస్తారు.కానీ,వీళ్లకు మల్లే ఆలోచించినోళ్లు గాబోలు అప్పటికే చాలామంది గుడికాడికొచ్చేస్తారు.శీనుగాడు కూడా అలా వాచ్చేవోళ్ల కోసవని,మిగతా కుర్రాళ్లు ఆరింటికొస్తారు కదా ఈలోపు అమ్మేసుకుందావని ఒంటిగంటకే స్నానం చేసి వచ్చేసాడు.కానీ మిగతా వాళ్లు కూడా అలాగే ఆలోచించి అప్పటికే దిగవడిపోయారు.
అప్పట్నించీ నోరవిసేలా అరుస్తూనే ఉన్నాడు.అమ్ముతూనే ఉన్నాడు."పూలూ పడగలమ్మా పూలూ పడగలు..!"ఎవరో అడిగితే చెప్తున్నాడు,"ఇవి హుండీలో వేస్తే మంచి జరుగుద్ది సార్"."ఇవిగోండి సుబ్రమణ్యేశ్ర సామికి ఇవంటే చాల ఇష్టవంట",రెండు మూడు వెండి పలుకుల్లాంటివి తీసి చూపించాడు.మళ్లా కాయితం పొట్లాం కట్టేస్కున్నాడు."ఇయ్యేనండి పూలూ పడగలంటే.మా అమ్మ మొక్కి హుండీలో ఏసిందంట ఈ సామికి.అబ్బాయ్ పుట్టాలని.అందుకే నేను పుట్టానండి",
"సర్లే ఒక రూపాయివి ఇవ్వు",
"ఒక్కొకరూ ఒక్కోటెయ్యాలండి",
"అలాగేలే ఐదివ్వు".
అలా అమ్ముతూ తెల్లగా తెల్లారేకా జనం బా తక్కువున్నారని,ప్రసాదాల దగ్గరకెళ్ళి పోయాడు.గరిటెడు చక్కర పొంగలి పెట్టారు అక్కడి బ్రాహ్మలు.గోపురానికి ఒక నమస్కారం పెట్టేస్కుని లాగించేసాడు ఆ ప్రసాదం.కోనేట్లో కాళ్ళూ చేతులూ మొహం కడుక్కుని మళ్లీ సందట్లోకీ పందిట్లోకీ వచ్చేసాడు.
పందిట్లో స్టేజ్ మీద కోలాటం చేస్తున్నారు.పురంధర దాసు కన్నడంలో రాసిన"దేవబందానమ్మ సామి బందానో",అనే పాటకి చేస్తున్నారు కోలాటం.జనం హోరు వరద గోదాట్లా ఉంది.మబ్బుల మాటున దాగిపోయిన సూర్యుడు చందమామలా ఉన్నాడు.జనం పెరిగిన కొద్దీ శీను గాడు ధనధనమని తిరుగుతూ పూలూ పడగల పొట్లాల్నీ కబుర్లనీ కలిపి అమ్మేస్తున్నాడు.తొమ్మిదో పదో అయ్యేపాటికి పాలి,రేలంగి,మంచిలి,కంచుమర్రు,ఈడూరు లాంటి దగ్గర ఊళ్ల వాళ్లు వస్తారు.భీమారం(భీమవరం),తణుకులాంటూళ్ల నించి పొద్దున్న వాళ్లూళ్లో దర్శనం చేసేసుకుని సాయంకాలం చల్లబాటున వస్తారు.మధ్యానం పన్నెండూ ఆ ప్రాంతాల్లో వీలు చూసుకుని ఓ పదినిముషాలు అన్నదాన సత్తర్వులో లోకెళ్లి ఓ బంతిలో అలా తినేసి ఇలా వచ్చేసేడు.
మధ్యానం జనం కొంత తక్కువున్నారు.సాయంత్రం ఊళ్లో వాళ్లు పునర్దర్శనానికి వస్తారు.వాళ్లకీ వెంటబడి అమ్మేడు,"పొద్దున్న తీర్చేసుకున్నాంలే",అని చాలామంది తీసుకోలేదు.చివరికి రాత్రికి కాళ్లీడ్చుకుంటూ ఇంటికి చేరేడు.శీను గాడి అమ్మా నాన్న ఉన్న ఎకరా కమత సాగు చేసుకుంటూ పక్కన ఓ రెండెకరాలు కౌలు చేసుకుంటున్నారు.పిల్లాడికి మంచి చదువు చెప్పించాలని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జేర్చేరు.పేటలో సాయంకాలమంతా ఆటలకి పోతాడు.కానీ క్లాసులో మంచి మార్కులొస్తాయి.శివరాత్రికి నత్తారామేశ్వరాన,ఊళ్లో షష్ఠికీ పూలూ పడగలూ అమ్ముతాడు.
తర్వాతి రోజు ఒళ్లంతా ఒకటే నొప్పులు,"యాభై రూపాయలు మిగిలాయి కదలే",అనుకుంటూ స్కూలు మానేసాడు.ఆ తర్వాతి రోజు స్కూలుకెళ్లాడు.క్లాసులోకి అడుగుపెట్టకుండానే,"నిన్నంతా నీ గురించే అడిగాడు డైరెక్టరు.రాలేదంటే ఇంటికెళ్లి తీసుకురమ్మన్నాడు,నీకు జ్వరమని చెప్పాను,స్కూల్కి రాంగానే ఆఫీస్ రూం కి రమ్మన్నాడు",అని బాంబు పేల్చేడు రాజేష్. భయంభయంగా ఆఫీసుకెళ్లి,"నన్ను రమ్మన్నారంట",అడిగాడు
"నేను కాదు డైరెక్టర్ సారు"అన్నాడు గుమస్తా.డైరెక్టర్ రూంకి గడగడా వణుకుతూ,"మే కమిన్ సార్",
"కమిన్",
లోపలికెళ్లాక పక్కరూంలో బెత్తం ఉంటుంది తీసుకురమ్మన్నాడు.ఏడుపుమొహంతో "సార్ సార్"అంటూ తెచ్చుకున్నాడు శీను."ఏరా కాన్మెంట్లో సదూకుంటున్నావా బోర్డిస్కూలో సదూకుంటున్నావా దొంగ నాయాలా.నిన్న పందిట్టో పడి పూలూ పడగలూ అమ్ముకుంటాంటే మన కాన్మెంట్ గురించి ఏవనుకుంటార్రా ఎదవా.నిన్నూ.."అని బెత్తం తీసి చెయ్యి పట్టుకుని బాదడం మొదలెట్టాడు.కాసేపట్లో చెయ్యి పెనమ్మీద పెట్టినట్టైపోయింది.
"మన పరువు"అని మళ్లా కొట్టటం మొదలెట్టాడు
"పరువు"మళ్లీ దెబ్బ,
"పరువు"అంటూ మళ్లీ కొట్టేడు
"పరువేంకావాల్రా నాయాల కనా అంటూ పేద్ద దెబ్బ కొట్టాడు."ఇంకెప్పుడూ చెయ్యను సార్",ఎక్కిళ్లడ్డం పడుతుండగా అన్నాడు."ఇంకో పాలి ఇట్టాంటి యెదవ పన్లు చేఅబ్బులు డాక్టర్ కీ పదమూడు.మొత్తం నలభై మూడు.నిన్నంతా అమ్మితే వచ్చిన కమీషను యాభై.తనకి మిగిలింది ఏ..డు..రూ..పా...య..లు,వాపులూ దెబ్బలూ.శీను ముఖం కందగడ్డలా ఉంది కోపంతో కాదు..బాధతో.మళ్లీ అరచేతులు చూసుకున్నాడు.సన్నటి కర్రపేళ్లు అరచేతులమ్మటా దిగిపోయాయి.వాటికన్నా నేనేం తప్పుచేసానని కొట్టాడు అన్న ఊహ మనస్సులో కలుక్కుమని దిగి బాధపెడుతోంది.నెప్పి వల్లో బాధ వల్లో తెలీదుగానీ కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయిసేవనుకో",మళ్లీ కొట్టబోతుంటే దూరంగా పారిపోయాడు శీను.
"ఇహపో ఎదవా",అన్నాడు డైరెక్టరు.గుమ్మం దాటుతుంటే"ఒరే!ఆఫీసులో ముప్ఫై రూపాయలు ఫైన్ కట్టు ఇన్నావా",
"సరే సార్",అన్నాడు ఏడుపుగొంతుతో.
క్లాసుకెళుతూ ఆలోచించుకుంటున్నాడు.ముప్ఫై ఫైను.టీటీ ఇంజక్షన్ కీ .
9 Responses
  1. చాలా బాగా రాసారు అభినందనలు


  2. Anonymous Says:

    బాగా రాసారు. హాస్యం రాస్తున్నారు గదా అనుకుంటూంటే ఒక్క పళాన ట్రాకు మార్చారే!

    పేరాగ్రాఫుల మధ్య ఒక లైను ఎడం ఉంటే బావుంటుంది


  3. Anonymous Says:

    Great


  4. meedi attilaa?
    maadi palakoderu


  5. @రాజేంద్ర కుమార్ దేవరపల్లి & అపరిచితుడు(anonymous) కృతఙ్ఞతలు
    @చదువరి ఇది నాకు మొదట్నించీ ఉన్న జబ్బే లెండి ఒక్క పడవమీద కాక మూణ్ణాలుగు పడవల ప్రయాణం గ్రహపాటు ఒక్కోటీ చెరోదిశగా పోతే తలపట్టుకోవడం అలవాటు
    @విహారి గారు ఆయ్ మాది అత్తిలండి కరట్టుగా చెప్పాలంటే అత్తిలి నుంచి భీవారమెళ్ళే దార్లో మంచిలి దాటాకా కంచుమర్రని మీరు వినే ఉంటారండి మరి మాది ఆ ఊరేనండి ఊళ్లోకొచ్చి కరణం గారి మనవడంటే ఎవరైనా చెప్పేత్తరండి ఎల్లెల్వయ్యా ఆరు గూడాన ఉంట్నారు గందా అని
    ---సంతోష్ సూరంపూడి


  6. పక్కింటబ్బాయి గారు.... మీ హాస్య రసం నషాలానికి ఎక్కి దిమ్మతిరిగెంచేలాగుంది.. గుడ్ ట్రై ...... బాగా రాసారు ....


  7. ఐరనీ అద్భుతంగా సాధించారు. అమరావతికథల్లో కొన్నిటికి సాటి వచ్చేలాగా ఉంది. మీరు ఇంకా రాయాలి.


  8. teresa Says:

    కళ్ళకి కట్టి ,మనసుని తట్టింది! శభాష్‌!


  9. Anonymous Says:

    good one