Your Ad Here

చక్రపాకం

సమయం:2సంవత్సరాల క్రితం,
రాత్రి 8:30ప్రదేశం:తాడేపల్లిగూడెంలో ఒకానొక గొందు
సైకిల్ తొక్కుతూ నాలుగైదు కుక్కలు WWF మ్యాచ్ ఆడుకుంటుంటే,ఎందుకొచ్చిన గోలలే అని వేరే సందులోంచి వెళ్తున్నాను.ఎనిమిదిన్నర అయ్యింది ఒక్కసారిగా ఎన్నో గొంతులతో"ఎందుకో నాకు ఈ ఆశలు..."అంటూ ధన్ మని మొదలయ్యాయి.సందులు మారుతున్నా పాట మాత్రం వదలదు.అంటే అన్ని సందుల్లో అన్ని ఇళ్లూ చూస్తున్నా సీరియల్ ఒకటే...........చక్రపాకం
*******
చక్రపాకం సీరియల్ కి ఒక ప్రత్యేకత ఉంది.కథ నాలుగు నెలలకొకసారి కాస్త,మూడు నేలలకోకసారి కూస్త కదులుతుంది.కానీ,ఒక్కరోజు మిస్సయినా ఏదో జరిగిపోతుందేమో అన్న భ్రమలో ఉంచుతుంది మనల్ని.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే .....
*******
సమయం:సంవత్సరం క్రితం(క్రీ.శ .2007),పగలు 12:00 ,
ప్రదేశం: మా ఎదురిల్లు(ఎదుటి వాళ్ల ఇల్లు వెదురు ఇల్లు కాదు).
మా ఎదురింటి వాళ్ల మామ్మ గార్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు.హార్ట్ ప్రాబ్లెం వస్తే ఆపరేషన్ చేయించారు.నీరసం వల్లో ఏమో గాని హాస్పిటల్లో ఆవిడ ఒక్కళ్లతో కూడా మాట్లాడలేదు.ఇప్పుడు చచ్చి బతికిన ఆవిడ మాట్లాడిన మొదటి మాట.
"సుబ్బులూ..!చక్రపాకం ఇక్ఫాల్ బతికే ఉన్నాడా"
ఆవిడనే కాదు ఆ టైం కరెంట్ పొతే కాల్ మూడు రూపాయలు చార్జ్ అయ్యే అప్పట్లోనే ఇరవై ఫోన్లో సోది వేసేది మా అక్క. ఫోన్ చెయ్యగానే అడిగే ప్రశ్న ఒకటే ",పిన్నీ చక్రపాకం ఏమయింది".
వీళ్ళందరి గట్టి నమ్మకం ఏంటంటే చక్రపాకం సీరియల్ ఒక్క రోజు మిస్సయినా కథ ఏదో జరిగిపోతుంది.
*******
నేను కూడా చక్రపాకం సీరియల్ చూసేవాణ్ణి(తొందర పడి బ్లాగ్ చదవటం మానేయ్యకండి చెప్పేది పూర్తిగా వినండి(చదవండి)).కాక పొతే రోజూ కాదు మూడు నెలలకి ఒకసారి.అయినా ఎవరూ చెప్పకుండా కథ అర్ధమైపోయేది.ఎందుకంటే కథ మూణ్ణెల్లకి ఒకసారి కదులుతుంది.నేను చూసినప్పుడు డైలాగుల బట్టి కథ ఏమయ్యిందో అర్ధఅమయ్యేది(కథంటూ ఏమైనా ఉంటే కదా ఏమైనా అవ్వడానికి).
*******
ఇక్కడ మీకో అనుమానం రావాలి అదేంటంటే ఇంతకీ మూణ్ణెల్ల కొకసారి జరిగే కథలో మిగతా ఎపిసోడ్లలో ఏం జరుగుతుంది. దీన్ని మా శివ గాడు ఒక మోడల్ ఎపిసోడ్ తో వివరిస్తాడు.
*******
సమయం:రాత్రి ఎనిమిది గంటల ముప్ఫై మూడు నిమిషాలు,
ప్రదేశం:ఏలూరులో శివ వాళ్ళింట్లో టివి ముందు.
చక్ర పాకంలో ఒక ఎపిసోడ్ మొదలయ్యింది.
ఇర్బాన్ ఫోన్ రింగ్ అవుతోంది.చూస్తే అది హీరోయిన్ నెంబర్(వాళ్ళిద్దరూ స్నేహితులు).ఎత్తుదామనుకుని తనతో నిన్న గొడవ కదా ఎందుకులే అనుకుని ఎత్తడం మానేస్తాడు.హీరోయిన్ సరదాగానే ఫోన్ చేస్తుంది.ఇదంతా చూస్తున్న ఇర్బాన్ భార్య ఫోన్ చేసినమ్మాయి మనకి మంచి ఫ్రెండ్ కదా ఏదో ప్రమాదంలో ఉంది ఫోన్ చేసి ఉంటుంది,తనని అవాయిడ్ చెయ్యొద్దు అని చెప్తుంది.నిజమే ఫూలిష్ గా కట్ చేశాను అంటాడు ఇర్బాన్.హీరోయిన్ ఇర్బాన్ ఏదో డేంజర్ లో ఉన్నాడు అందుకే ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదు అనుకుంటుంది.అక్కడికి బ్రేక్.
బ్రేక్ లో చానల్ మార్చనివ్వరు.ఏమైనా అంటే చక్రపాకంలో యాడ్లు తక్కువ వస్తాయి(భారీ అబద్ధం)అంటారు.
సీరియల్ మళ్ళీ మొదలయ్యాకా ఇర్బాల్ కి ఏమయ్యిందో అని హీరోయిన్ ఇర్బాల్ వాళ్ల అమ్మకి ఫోన్ చేస్తుంది.హీరోయిన్ కి ఏమయ్యిందో అని ఇర్బాల్ హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు.ఇర్బాల్ బానే ఉన్నాడని వాళ్ళమ్మ హీరోయిన్ కి చెప్తుంది.ఇర్బాన్ కి హీరోయిన్ నంబర్ ఎంగేజ్ రావడంతో హీరోయిన్ ఏదో కష్టాల్లో ఉందని ఫిక్స్ అయిపోతాడు.ఒకరికొకరు ఫోన్ చేస్తారు.దాంతో ఎంగేజ్ వస్తుంది.ఇద్దరూ కంగారు పడతారు.ఇర్బాన్ మళ్ళీ ఫోన్ చేస్తాడు ఈసారి కలుస్తుంది.
పాటికి ఎపిసోడ్ అయిపోతుంది.
పైన చెప్పిన ఎపిసోడ్ వల్ల కథ ఏమాత్రమైనా కదులుతుందా?
*******
మామూలుగా చాలా మంది చక్రపాకం అయిపోవస్తుందన్న నమ్మకంతో చూసేవాళ్ళు మొదట్లో ఇక్ఫాల్ (హీరో) చనిపోయాక సీరియల్ అయిపోతుందనుకుని చూడటం మానేసినవాళ్ళు చూడటం మొదలుపెట్టారు(రాత్రి ఎనిమిదిన్నరకి బయటికి వెళ్లవలసి వస్తె జనాలు చక్రపాకం చూస్తున్నారా మానేసారా అన్నది తెలిసేది (పాట అన్ని ఇళ్లల్లోంచి వినిపించడం బట్టి).కాని వాళ్ల పిల్లలతో సీరియల్ కొనసాగించడంతో మతి పోయినత పనైంది.ఇప్పటికన్నా అందరూ సీరియల్ అయ్యింది అంటున్నారు గానీ నాకు అనుమానమే. ఎందుకంటే ఇర్బాల్ కి ఒక పిల్లోడు పుట్టాడు.వాడితో ఏమైనా సీక్వెల్ ప్లాన్ చేసారేమోనని అనుమానం.మనం వద్దనుకుంటే తియ్యడం మానేస్తారా అంజలా నాయుడు గారి దయ బుల్లితెర ప్రాప్తం
*******
వివరణ:పై టపాలోని వ్యక్తులు సంస్థలూ పూర్తిగా నా కల్పితం.నిజజీవితంలోని సంస్థలతో గాని,వ్యక్తులతో గాని పోలిక ఉంటే అదంతా కేవలం యాధౄచ్చికం.
*******
(పై వివరణను నమ్మగలిగిన వారు ఎటువంటి సీరియల్నైనా విచ్చల విడిగా చూడొచ్చు)